అధికారికంగా దొడ్డి కొమురయ్య జయంతి ఉత్సవాలు

 

 

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సోమవారం జిల్లా పాలనాదికారి కార్యాలయం లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన దొడ్డి కొమరయ్య జయంతి ని అటవీ,పర్యావరణ, న్యాయ,దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి,జిల్లా పాలనాధికారి వరుణ్ రెడ్డిలు
దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అన్నారు.
దొడ్డి కొమరయ్య జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండి గ్రామంలో 1927 ఏప్రిల్ 3న జన్మించారని తెలిపారు.తెలంగాణ సాయుధ పోరాటం ప్రారంభమవడానికి భూమికోసం,భుక్తి కోసం,విముక్తి ఉద్యమంగా మారడానికి ఆయన అమరత్వమే కారణమని అన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాంబాబు,బిసి సంక్షేమ అధికారి లోకేష్,జిల్లా అధికారులు,ప్రజాప్రతినిధులు,సంఘ నాయకులు, తదితరులు పాల్గోన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking