వ్యవసాయ,ఉద్యాన వర్సిటీ భూములను హైకోర్టుకు కేటాయించవద్దు…..

జీవో 55ను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలి……
హైదరాబాద్:ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం భూమిని హైకోర్టుకు కేటాయించవద్దని,జీవో 55ను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి
చింతకాయల ఝాన్సీ డిమాండ్ చేశారు.
సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో స్టేట్ యూనివర్సిటీస్ కన్వీనర్ జీవన్,రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు పృథ్వీతేజ, కళ్యాణిలతో కలిసి ఆమె మాట్లాడుతూ ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయం సమాజానికి ఉపయోగపడే వినూత్న పరిశోధనలు జరుగుతున్న ప్రదేశమన్నారు.ఏ ప్రభుత్వం వచ్చినా విశ్వవిద్యాలయాల భూములపై కన్నేయడం పరిపాటిగా మారిందని ఆరోపించారు. గత ప్రభుత్వంలో విద్యార్థులకు జరిగిన అన్యాయాలను దృష్టిలో ఉంచుకొని విద్యార్థి లోకం ఏకమై విద్యావ్యవస్థ బాగుపడి ఉపాధి కల్పన జరుగుతుందని ఆశతో నూతన ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల గడవకముందే ఈ విధంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ భూమిని హైకోర్టు నూతన భవనానికి కేటాయిస్తే విద్యార్థుల జీవితాలను, యూనివర్సిటీలను అంధకారంలోకి నెట్టి వేయడమేనన్నారు. ఏ ప్రభుత్వాలు కూడా విద్యాసంస్థలకు కాకుండా ఇతర సంస్థలకు భూమిని కేటాయించలేదని ఈ ప్రభుత్వం మాత్రం ఎందుకు ఈ విధంగా విద్యార్థులకు, వ్యవసాయ రంగానికి అన్యాయం చేసే దిశగా నిర్ణయం తీసుకుంటుందని అన్నారు.అగ్రికల్చర్ యూనివర్సిటీకి చెందిన 100 ఎకరాలలో హైకోర్టు నిర్మిస్తే బయోడైవర్సిటీ పార్కులో ఉన్న జీవ వైవిద్యము కోల్పోతామని, ఇక్కడ దాదాపు 350 కి పైగా పక్షులు మరియు జంతువులు, 450 కి పైగా వృక్ష జాతులు, వృక్ష ఔషధ జాతులు 80, తిగ జాతులు 30 ఉన్నాయని వీటన్నిటిని సంరక్షిస్తూ బయోడైవర్సిటీ పార్కు చేయడానికి 25 సంవత్సరాల కృషి ఉందని అన్నారు. దేశంలో అంతరించిపోతున్న 5 జాతులలో నాలుగు జాతులు ఇక్కడే ఉన్నాయి మరియు ఆ స్థానంలో రెండు లక్షల చెట్లు ఉన్నాయి ఒక్కో చెట్టు విలువ జీవితకాలం ఇచ్చే ఎకనామిక్ బెనిఫిట్ 32 లక్షలు ఉంటుంది. మొత్తం ఈ యూనివర్సిటీలో ఆరు లక్షల చెట్లు ఉంటాయి ఈ యూనివర్సిటీ ని లంగ్స్ ఆఫ్ హైదరాబాద్ గా పిలుస్తారు ఈ లెక్కన ఇది కొన్ని కోట్ల వృక్ష సంపద హైదరాబాద్ ఉష్ణోగ్రతకి రాజేంద్రనగర్ ఉష్ణోగ్రతకి రెండు డిగ్రీల తేడా ఉంటుంది. పంట తెగులు నిర్వహణ కూడా ఇక్కడున్న జీవవైవిద్యం వలన తీగ మొక్కలను గుర్తించి పెస్ట్ మేనేజ్మెంట్ అయ్యేవిధంగా ఎన్నో పరిశోధనలు చేసి సేవలందిస్తుంది అన్నారు. ఈ యూనివర్సిటీని డిస్టర్బ్ చేస్తే పరిశోధనలపై చాలా ప్రమాదం ఉంటుందని, వ్యవసాయ రంగానికి సరైన దిశా నిర్దేశం చేయలేని పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. కావున వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా నిర్ణయాలు చేయాలి తప్ప అదినాతనమైన రీసెర్చ్లు చేసి వ్యవసాయ రంగానికి చేయూతనిచ్చే పరిశోధనలకు ఆటంకం కలిగించి భవిష్యత్ భావితరాలకు అన్యాయం చేయొద్దని, ప్రభుత్వం ఇప్పటికైనా తమ నిర్ణయం మార్చుకోవాలని, లేనియెడల రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉదృతం చేసి జీవో రద్దయ్యే వరకు ఏబీవీపీ ఉద్యమిస్తుందని హెచ్చరించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking