పేద ప్రజల ఆశాకిరణం మైనంపల్లి హన్మంతరావు ఘనంగా జన్మదినోత్సవ వేడుకలు

– ప్రత్యేక పూజలు, ప్రార్థనలు, రోగులకు పండ్లు పంపిణి చేసిన కాంగ్రెస్ నాయకులు
హాజరైన ప్రజాప్రతినిధులు.

మెదక్ జనవరి 10 ప్రాజబలం న్యూస్:-

మేడ్చల్ మల్కాజిగిరి మాజీ శాసన సభ్యులు, మెదక్ నియోజక వర్గ శాసన సభ్యులు డా. మైనంపల్లి రోహిత్
తండ్రి మైనంపల్లి హన్మంతరావు జన్మదినోత్స వేడుకలు మెదక్ పట్టణంలో బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మెదక్ పట్టణంలోని రామాలయం దేవస్థానంలో హన్మంతరావు పేరు మీద ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. అనంతరం మెదక్ మహాదేవాలయం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం మెదక్ పట్టణంలోని గురుకుల పాఠశాల్లో విద్యార్థినులతో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మెదక్ పిట్లంబేస్ లోని దర్గా వద్ద ముస్లీం మతపెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం మెదక్ మాతాశిశు ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ చల్ల నరేందర్ పటేల్ ,మాజీ చైర్మెన్ కొండన్ సురేందర్ గౌడ్, న్యాయవాది జీవన్ రావ్, బొజ్జ పవన్, కౌన్సిలర్ లు దాయర లింగం, ఆవారి శేఖర్, దొంతి లక్ష్మి ముత్యం గౌడ్, మాజీ కౌన్సిలర్ లు ఎస్.డి. జ్యోతి క్రిష్ణ, ఎర్రోళ్ళ జయరాజ్, మున్నా, దాయర రవి లతో పాటు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గూడూరి ఆంజనేయులు, రమేశ్, భూపతి యాదవ్, కరీం, గూడూరి అరవింద్, గూడూరి క్రిష్ణ, హరిత, బట్టి సులోచన, పోచేందర్, సలీం, షేక్ మున్నా, సాదిక్, లంబూ అహ్మద్, బ్లాక్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు హపీజ్ మోల్సాబ్, పరుశురాం, బొంబాయి ఆరీప్, గాడి రమేష్, రాజలింగం, అన్వర్, అహ్మద్, బోస్ లతో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గోన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking