— జిల్లా అదనపు కలెక్టర్ వేంకటేశ్వర్లు
మెదక్ మే 30 ప్రాజబలం న్యూస్ :-
శంకరంపెట్ మండలం లోని విరోజ్ పల్లీ ,జూకల్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన పీసీసీ, ఐ కె పి కేంద్రాలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు ప్రక్రియ చివరి దశలో ఉందని, ధాన్యం కొనుగోలు ప్రక్రియలో సిబ్బంది అలసత్వం చేయొద్దని, సరైన తేమను నమోదు చేయాలని, ధాన్యం కొనుగోలను రికార్డులలో నమోదు చేసి ఆన్లైన్ చేయాలని అన్నారు. శంకరంపేట(ఏ ) ఉన్న రైస్ మిల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసి లారీల అన్లోడింగ్ పై అగ్రహం వ్యక్తం చేశారు. లారీలలో అన్లోడింగ్ ప్రక్రియ తరితగతిన పూర్తి చేసి లారీలను త్వరగా ధాన్యం కేంద్రాల వద్దకు పంపించాలని సిబ్బందిపై అగ్రహం వ్యక్తం చేశారు.
ధాన్యం కొనుగోలులో సిబ్బంది అలసత్వం చేయవద్దని , ధాన్యం సేకరణ లో త్వరగా ఎగుమతులు చేసి రైతులకు న్యాయం చేయాలని సిబ్బందికి సూచించారు.
ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది ,తదితరులు పాల్గొన్నారు.