గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేయాలి.

పరీక్షకు ముందుగానే అభ్యర్థులు కేంద్రానికి చేరుకోవాలి.

ఎలక్ట్రానిక్ పరికరాలకు పరీక్ష కేంద్రాలలో కి అనుమతి లేదు.

జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు.

కలెక్టర్ రాహుల్ రాజ్

మెదక్, మే 30, ప్రజాబలం న్యూస్ :-

వచ్చే నెల 9 వ తేదీన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు.
వచ్చే నెల 9 వ తేదీన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం లోని మినీ మీటింగ్ హల్ లో
కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ రెవిన్యూ వెంకటేశ్వర్లు, ఏఎస్పీ మహేందర్ వివిధ శాఖల అధికారులతో కలిసి గురువారం సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఉదయం 10.30 గంటల నుండి మధ్యాన్నం 1.00 గంట వరకు కొనసాగే గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు జిల్లాలో 3912 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని తెలిపారు. అభ్యర్థుల సంఖ్యకు అనుగుణంగా జిల్లాలో 10 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని కలెక్టర్ వివరించారు. ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే, జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా నెలకొల్పిన కంట్రోల్ రూమ్ 9908696575నెంబర్ కు ఫోన్ చేయవచ్చని సూచించారు.
ముందుగానే చేరుకోవాలి.
పరీక్ష కేంద్రాలలో టేబుల్ డెస్క్ లను ఏర్పాటు చేయాలని సూచించారు. కేంద్రాలలో సిసి కెమరాలను ఏర్పాటు చేయాలని, ప్రశ్నపత్రాలను పంపిణి మొత్తం సిసి కెమరాల ద్వారా కెమరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
పరీక్షలకు వచ్చే దివ్యంగులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాటు చేయాలని అన్నారు. పరీక్ష కేంద్రానికి అభ్యర్థులు ముందుగానే చేరుకోవాలని, అలస్యం అయిన వారిని పరీక్షకు అనుమతించడం జరగదని స్పష్టం చేశారు.
అదేవిధంగా ప్రతి పరీక్షా కేంద్రంవద్ద మంచినీరు, టాయిలెట్లు సక్రమంగా ఉండేలా చూడాలని, ఎటువంటి ఇబ్బందులు, సమస్యలు తలెత్తకుండా ముందుగానే సరిచూసుకోవాలని పేర్కోన్నారు. పరీక్ష కేంద్రాలకు ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షను వ్రాసే వారితొ పాటు ఇన్ విజిలేటర్లకు సైతం అనుమతిలేదని తెలిపారు.
ఒక్క చీఫ్ సూపరిండింట్ వద్ద తప్ప ఎవ్వరి మొబైల్ ఫోన్ లకు అనుమతి లేదని స్పష్టం చేశారు.
పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ, పరిసర ప్రాంతాల్లోని జిరాక్స్ సెంటర్ లను మూసి ఉంచేలా చర్యలు చేపట్టాలని అన్నారు. ఆర్టీసీ అధికారులు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా బస్సులు నడిపించాలని, ఎలక్ట్రిసిటీ అధికారులు విద్యుత్ సరఫరా లో ఎలాంటి లోపం లేకుండా ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పరీక్షకు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
సమావేశంలో డిఆర్ఓ మెదక్ పద్మశ్రీ,
ఆర్డీవో రమాదేవి జిల్లా విద్యాశాఖ అధికారి రాధాకృష్ణ ,డి ఆర్ డి ఓ
పి డి శ్రీనివాసరావు,
కే హుస్సేన్ ప్రిన్సిపల్ మెదక్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking