ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మే 30 : మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సహకారంతో లక్షెట్టిపేట పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామని డీసీసీ ఉపాధ్యక్షుడు చింత అశోక్ పేర్కొన్నారు. గురువారం మంచిర్యాల నియోజకవర్గంలోని లక్షెట్టిపేట మున్సిపాలిటీ 14 వ వార్డు కౌన్సిలర్ సువర్ణ డీ ఎం ఎఫ్ టీ నిధులతో మంజూరైనా సీ సీ రోడ్లను ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి హాజరైన అయన మాట్లాడుతూ…డీ ఎం ఎఫ్ టి నిధుల ద్వారా ప్రజల సౌకర్యార్థం14 వ వార్డ్ లోని కాలనీ వాసులకు సీసీ రోడ్డు మంజూరు చేసిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుకి రుణపడి ఉంటామన్నారు. అనంతరం కౌన్సిలర్ సువర్ణ మాట్లాడుతూ…కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు న్యాయం జరుగుతుందని,మన ఎమ్మెల్యే సహకారంతో నిధులు మంజూరు చేసారన్నారు.ప్రతి సమస్యలపై ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి అభివృద్ధికి కావాల్సిన నిధులు మంజూరు చేయిస్థామన్నారు. డ్రైనేజీ సీ సీ రోడ్లు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.అన్ని విధాల సహకరించిన మున్సిపల్ కమిషనర్ కు అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉత్తురి రవీందర్,రావుల రాజమౌళి,బిరుదుల దర్మయ్య, కాలనీ వాసులు వంగల మధుసూదన్,ఉత్తురి వేణు,గంప రమేష్ తదితరులు పాల్గొన్నారు.