బీజేపీ,కాంగ్రెస్ ల మాటలు నమ్మవద్దు, బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్సీ నారాదాసు లక్ష్మణ్

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 31 : బీజేపీ,కాంగ్రెస్ పార్టీల మాటలు ప్రజలు నమ్మవద్దని మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్,మాజీ ఎమ్మెల్సీ నారాదాసు లక్ష్మణ్ రావు అన్నారు.శుక్రవారం పట్టణంలోని స్థానిక ఎస్ పీ ఆర్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన బీ ఆర్ ఎస్ ఆత్మీయ సమ్మేళనం లో ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ నారాదాసు లక్ష్మణ్ మాట్లాడుతూ….బీజేపీ పార్టీ అదాని,అంబానీ లాంటి కార్పొరేట్ల కు కొమ్ముకాస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు తమ కుర్చీల కోసం పొట్లాడటం తప్ప ప్రజలకు ఏమి చేయలేరని ఏద్దేవా చేశారు. ముఖ్యంగా బీ ఆర్ ఎస్ చేస్తున్న అభివృద్ధి,సంక్షేమ పథకాలు వచ్చే ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించేలా ఉపయోగపడుతాయన్నారు.ప్రతి కార్యకర్త ప్రభుత్వం చేసిన అభివృద్ధి ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.అంతకుముందు ఎమ్మెల్యే దివాకర్ రావు మాట్లాడుతూ… పేకాట,మద్యం పై ఆధారపడి రాజకీయం చేసే ప్రేమ్ సాగర్ రావుకు ప్రజల బాధలు ఎలా అర్ధం అవుతాయని ప్రశ్నించారు? పదవుల్లో వున్నప్పుడు ప్రజలను ప్రేమ్ సాగర్ రావు పట్టించుకోలేదని విమర్శించారు.అనంతరం నడిపల్లి ట్రస్ట్ చైర్మన్ విజిత్ మాట్లాడుతూ… గూడెం లిఫ్ట్ గురించి కాంగ్రెస్,బీజేపీ లు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని మండిపడ్డారు. ప్రతి ఇంటికి అభివృద్ధి,సంక్షేమ పథకాలు అందుతునట్లు పాదయాత్ర లో ప్రజలు చెబుతున్నారని వివరించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కాంతయ్య, వైస్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్,బీ ఆర్ ఎస్ పట్టణ అధ్యక్షుడు పాదం శ్రీనివాస్,మండలధ్యక్షుడు చిన్నయ్య,మాజీ డీసీఎమ్మెస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి,బీఆర్ఎస్ నాయకులు,అధిక సంఖ్యలో కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking