వరంగల్ ప్రజాబలం ప్రతినిధి మార్చి 31:
వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని ఎంజిఎం సర్కిల్ లో నూతనంగా ఏర్పాటు చేసిన స్వాగత్ స్పైసి మ్యాజిక్ మల్టీ క్యూసిన్ రెస్టారెంట్ ను శుక్రవారం వరంగల్ తూర్పు పశ్చిమ ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్ ,దాస్యం వినయ్ బాస్కర్, మేయర్ గుండు సుధారాణి లు ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా యాజమానులు రాకేష్ రాజులకు శుభాకాంక్షలు తెలియజేసి వారి వ్యాపారం దినదినాభివృద్ది చెందాలని వారు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ విజయలక్ష్మి సురేందర్, షఫీ, తదితరుల పాల్గొన్నారు.