ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. ఆర్జీయూకేటీ బాసర క్యాంపస్ లో గల కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా అధికార గణంతో సమన్వయ సమావేశాన్ని శుక్రవారం ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్జీయూకేటీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ వెంకటరమణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్మల్ జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి డైరెక్టర్ ప్రొఫెసర్ సతీష్ కుమార్ పాల్గొన్నారు. ఆర్జీయూకేటీలో జరిగిన,జరుగుతున్న, జరగబోయే కార్యక్రమాలు, కార్యాచరణ,అమలు గురించి వివిధ శాఖల అధికారులతో చర్చోప చర్చలు జరిగాయి. విద్యార్థులకు సెలవులు ప్రకటించిన సమయంలో ఆర్టీసీ బస్సు సౌకర్యాల గురించి ఆర్టీసీ అధికారులతో చర్చించారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ జిల్లా అధికారులతో ఆర్జీయూకేటీలో పలు సమస్యలు తలెత్తినప్పుడు ఎలా అధిగమించాలో,వాటి పరిష్కార మార్గాల గురించి చర్చించడం జరిగింది.ఈ సందర్భంగా ఎలక్ట్రిసిటీ అధికారులు పలు సూచనలు చేశారు. మిషన్ భగీరథ అధికారులతో గోదావరి నుండి క్యాంపస్ వరకు పైప్ లైన్ ద్వారా నీటిని తీసుకుంటున్న సందర్భంలో మిషన్ భగీరథ పథకం అమలు ద్వారా ప్రయోజనాలు, అమలు చేసినట్లయితే కావలసిన పరికరాలు తదితర అంశాలపై చర్చించడం జరిగింది. పంచాయతీరాజ్ శాఖ అధికారులతో క్యాంపస్ లో ఆరో ప్లాంట్స్ ద్వారా మంచినీళ్లను అందించే క్రమంలో వచ్చే సమస్యలను ఎలా అధిగమించాలో, పరిష్కార మార్గాలు చర్చించడం జరిగింది. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో ఉన్న వనరులను క్యాంపస్కు ఎలా ఉపయోగించుకొని సమన్వయంతో ముందుకెళ్లే కార్యాచరణ గురించి చర్చించారు.ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులతో విద్యార్థులకు వారంలో ఒకసారి ట్రాకింగ్ వాక్ నిర్వహించేందుకు ఏ విధమైన చర్యలు చేపట్టాలి.అడవి జంతువుల పై అవగాహన,పక్షులపై ఫోటోగ్రఫీ శిక్షణ, బయో డైవర్సిటీ విధానాన్ని అమలు పరచడం, ఫోటోగ్రఫీ క్లబ్, కిచెన్ గార్డెన్ ను ఏర్పాటు చేయడం, నేచర్ క్లబ్ ను ఏర్పాటు చేయడం తదితర అంశాలపై చర్చించడం జరిగింది. హెచ్ఎండిఏ అధికారులతో చర్చిస్తూ ఇప్పటివరకు లక్ష మొక్కలను నాటడం జరిగిందని ఇందులో పూలు, పండ్లు, కూరగాయలు, తదితర రకాలైన మొక్కలు ఉన్నాయని తెలపడం జరిగింది. పంచాయతీరాజ్ శాఖ అధికారులు ప్రధానంగా క్యాంపస్ లో ఉన్న డ్రైనేజ్ సిస్టం, డ్రింకింగ్ వాటర్ సిస్టంలను మెరుగుపరిచేందుకు ఏ విధమైన చర్యలు తీసుకోవాలో చర్చలు జరిపారు. విద్యార్థులకు విశ్వవిద్యాలయం సెలవులు ప్రకటించిన సందర్భంలో సౌత్ సెంట్రల్ రైల్వే సంస్థ నుండి 50 శాతం రాయితీతో ప్రయాణం చేసే విధంగా చర్యలు చేపట్టాలని,సంబంధిత అధికారులతో చర్చించడం జరిగింది. పంచాయతీరాజ్ శాఖ, ద్వారా విద్యార్థుల తల్లిదండ్రుల సౌకర్యార్థం కోసం ప్రధాన ద్వారం దగ్గర పేరెంట్ లాంజ్, ను ఏర్పాటు చేసేటందుకు చర్చలు జరిపామనీ, విసి ప్రొఫెసర్ వెంకటరమణ గారు తెలిపారు. వివిధ విభాగాలకు చెందిన అధికారులకు, ఆర్జీయూకేటీ అధికారులకు మధ్య సమన్వయం కొరకు ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క నోడల్ ఆఫీసర్ ను నియమించినట్లు కలెక్టర్ శ్రీ వరుణ్ రెడ్డి గారు తెలిపారు.ఈ సమావేశానికి ముందు నిర్మల్ జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి వీసీ ప్రొపెసర్ వెంకటరమణ సమక్షంలో, డైరెక్టర్ ప్రొఫెసర్ సతీష్ కుమార్ పుష్పగుచ్చంతో స్వాగతం పలికినారు. అనంతరం కలెక్టర్ శ్రీ వరుణ్ రెడ్డి చేతుల మీదుగా విసి ప్రొఫెసర్ వెంకటరమణ,డైరెక్టర్ ప్రొఫెసర్ సతీష్ కుమార్ సమక్షంలో క్యాంపస్ హెల్త్ సెంటర్లో మార్గ్ సాఫ్ట్వేర్ను ప్రారంభించారు.ఈ మార్క్ సాఫ్ట్వేర్ ద్వారా హెల్త్ కార్డ్ నువ్వు ఉపయోగించి వైద్యం పొందుటకు, రూపొందించారు. ఈ హెల్త్ కార్డు ద్వారా విద్యార్థి పూర్వపరాలతోపాటు, మెడికల్ హిస్టరీ లను తెలుసుకోవడం తద్వారా త్వరితగతిన వైద్యం అందించడం జరుగుతుందని, విసి, ప్రొఫెసర్ వెంకటరమణ గారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అన్ని విభాగాల, అధికారయంత్రాంగం, ఆర్జీయూకేటీ వివిధ విభాగాలకు చెందిన ఫ్యాకల్టీ ఇంచార్జ్ స్పెషల్ ఆఫీసర్స్, పిఆర్వో డాక్టర్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.