భిన్నమైన పనులు చేయరు. చేసే పనులను మాత్రమే భిన్నంగా చేస్తారు.

వేములవాడ ప్రజాబలం ప్రతినిధి:వివిధ రంగాలలో రాణిస్తున్న వ్యక్తులను ఉద్ధేశించి ఓ వ్యక్తి చెప్పిన మాటలివి.సందరగిరి ప్రవీణ్‌ గౌడ్‌ ఇందుకు తాజా ఉదాహరణ.
వేములవాడ స్వగ్రామం. అరబ్‌ దేశాలకు వెళ్లి ఫుడ్‌ సెక్షన్‌ లో పని చేశారు. ఆ విదేశీ కార్మికులు వివిధ రకాలుగా చేసే వంటకాలు గమనించేవారు.వేములవాడ వచ్చాక తనకు ప్రవేశం ఉన్న హొటల్‌ రంగంలో ఉపాధి పొందాలని భావించి వేములవాడ పట్టణంలో మూలవాగు బండ్‌ పార్క్‌ పక్కన తన స్వంత స్థలంలో నందీశ్వర హొటల్‌ , టిఫిన్‌ సెంటర్‌ ను ఇటీవలే పెట్టారు.పోటీ ఎక్కువగా ఉండడంతో నాన్‌ వెజ్‌ దోష ను ప్రజలకు పరిచయం చేశారు. ఎగ్‌, చికెన్‌ తో కూడిన దోష, పూరి ఫుడ్‌ లవర్స్‌ ను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఆహా ఏమి రుచి అంటూ లొట్టలేసుకుంటూ ఆరగిస్తున్నారు.
మళ్ళీ వచ్చేలా హొటల్‌ నోరూరిస్తుంది.మిగతా హోటల్స్‌ కు భిన్నంగా టిఫిన్‌ లు చేయడంతో ఫుడ్‌ లవర్స్‌ ఎక్కువగా వస్తున్నారని చెబుతున్నారు ప్రవీణ్‌.

Leave A Reply

Your email address will not be published.

Breaking