సమాజంలో అందరూ సమానులే అందులో మేము ఒక భాగమే
మా జీవనోపాధి కోసమే భిక్షాటన చేస్తున్నాం
ఎటువంటి ఆసాంఘిక కార్యకలాపాలకు పాల్పడడం లేదు
పోలీసుల వేధింపులు సరైంది కాదు
ఖమ్మం జిల్లా ట్రాన్స్ జెండర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు దోమల మేరీ
ఖమ్మం ప్రతినిధి జనవరి 23 (ప్రజాబలం) ఖమ్మం
ఎవరో చేసిన తప్పుకు మమ్మల్ని బాధ్యులు చెయ్యొద్దని, సమాజంలో అందరితోపాటు మేము కూడా ఒక భాగమేనని, ట్రాన్స్ జెండర్స్ అయినంత మాత్రాన చులకనగా అవమానకరం గా బాధించడం సరైనది కాదని, కొందరు పోలీసు అధికారులు తమను నేరస్తులుగా ముద్ర వేసి ప్రతి అంశానికి వేధించడం మానుకోవాలని ఖమ్మం జిల్లా ట్రాన్స్ జెండర్స్ జిల్లా అధ్యక్షురాలు దోమల మేరి ఆవేదన వ్యక్తం చేశారు ఖమ్మం ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దోమల మేరీ మాట్లాడుతూ. మా జీవనోపాధి కోసం భిక్షాటన చేసుకుంటూ జీవించే వ్యక్తులమే తప్ప దొంగతనాలకు , ఇతర ఆసాంఘిక కార్యకలాపాలకు పాల్పడి ప్రోత్సహించే వ్యక్తులము కాదని, ఎక్కడ ఏ తప్పు జరిగిన దానికి మమ్మల్ని బాధ్యులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు .

ఎందుకంటే సమాజంలో మేము తేలికగాచులకనగా కనిపించే వ్యక్తులుగా ఉన్నామని ప్రతి అంశానికి మమ్మల్ని బాధ్యుల్ని చేయటం మంచిది కాదని అన్నారు ఎలాగో కుటుంబాలకు సమాజానికి దూరమై బ్రతుకుతున్నాం ఇప్పుడే సమాజంలో మేము గుర్తించబడుతున్నాం మా జీవితాలను చీకట్లోకి నెట్టకుండా కాపాడాలని విలేకరుల సమావేశంలో వేడుకున్నారు. ఎక్కడ ఏదైనా సంఘటన జరిగిన దానికి హిజ్రాలను బాధ్యులుగా చూస్తున్నారని, వాయిస్ తేడాగా ఉందని భావించి దానికి ట్రాన్స్ జెండర్స్ పై నేరాన్ని మోపడం ఎంతవరకు సమంజసమని, నేరస్తులను గుర్తించే బాధ్యత పోలీసు యంత్రాంగం పై ఉందని, అనేక కేసులలో మేమే నేరస్తులను గుర్తించి పోలీసులకు అప్పగించిన సంఘటనలు అనేకం ఉన్నాయని పేర్కొన్నారు. ఫంక్షన్లో ఉండగా ఓ పోలీస్ అధికారి తన పట్ల ఆ మర్యాదగా ప్రవర్తించారని, ఫంక్షన్ జరుగుతుండగా అందరి సమక్షంలో ఓ పోలీస్ అధికారి ప్రవర్తించిన తీరు సరైంది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో మేము కూడా ఒక భాగమేనని మమ్మల్ని గుర్తించి గౌరవించాలని ప్రాధేయపడ్డారు ఈ విలేకర్ల సమావేశంలో ట్రాన్స్ జెండర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ సిహెచ్ సోనీ , ఈసీ నెంబర్స్ ఆర్ మాధురి రూప నాగమణి తదితరులు పాల్గొన్నారు