ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ జనవరి 23 :
మందమర్రి మున్సిపల్ ఎన్నికల సాధన కమిటీ ఆధ్వర్యంలో మందమర్రి మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ గురువారం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఎన్నికల సాధన కమిటీ కన్వీనర్ అందుగుల శ్రీనివాస్, నాయకులు డి.వీ దీక్షితులు, మేడిపల్లి సంపత్, రాయబారపు వెంకన్న, మిట్ట లక్ష్మణ్, బండారి సూరిబాబు, కొంగల తిరుపతిరెడ్డి మాయ రమేష్, దాసరి రాజనర్సు, సప్పిడి నరేష్, రామసాని శేఖర్, తదితరులు పాల్గొన్నారు.