ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ జనవరి 23 :
మందమర్రి పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు నీలం కొమురయ్య ఇటీవల మరణించగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి ఆదేశాల మేరకు దశ దిన కర్మకు హాజరైన అఖిల భారత యాదవ మహాసభ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ నాయకులు బండి సదానందం యాదవ్ హాజరై వారి కుటుంబానికి 10 వేల రూపాయలు ఆర్ధిక సహాయం అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాక వెంకటస్వామి హాయం నుండి వివేక్ వెంకటస్వామి, వినోద్, వంశీకృష్ణ ల కుటుంబానికి విధేయుడుగా ఉంటున్నాని వారి బాటలో జీవితాంతం నడుస్తానన్నారు.