పదవ తరగతి పరీక్షలల్లో వంద శాతం ఫలితాలు సాధించాలి

సింగరేణి పాఠశాలల సెక్రటరీ (కొత్తగూడెం) జి. శ్రీనివాస్

ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ జనవరి 23:

పదవ తరగతి పరీక్షలలో వంద శాతం ఫలితాలు సాధించాలని సింగరేణి పాఠశాల సెక్రటరీ శ్రీనివాస్ అన్నారు. గురువారం మందమర్రి పట్టణంలోని ఎస్సీ హై స్కూల్ ఎయిడెడ్ కళ్యానిఖనిని సందర్శించారు. పాఠశాలలోని తరగతుల నిర్వహణ మరియు విద్యార్థుల హాజరు భోజన వసతులు మొదలగునవి పరిశీలించి సంతృప్తి చెందారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థులు నూటికి నూరు శాతం ఉత్తీర్ణ సాధించి ఎక్కువ గ్రేడ్ పాయింట్స్ సాధించాలని విద్యార్థులను కోరారు. ఈ సందర్భంగా పాఠశాలల్లోని వివిధ విభాగాలలోని పనితీరును పరిశీలించి వివిధ రంగాలలో బహుమతులు సాధించిన విద్యార్థులను ప్రశంసించడమే కాకుండా వారికి బహుమతులతో ప్రోత్సహించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని మధ్యాహ్నం భోజనాన్ని పిల్లలకు వడ్డించడమే కాకుండా స్వయంగా రుచి చూశారు. ఇటీవల జరిగిన సీఎం కప్ మరియు సైన్స్ ఒలంపియాడ్ లో ప్రతిభ కనపర్చిన విద్యార్థులకు బహుమతులు ఇచ్చారు. పాఠశాలలో కర్మచారినిగా పనిచేస్తున్న శ్రీమతి కమలని మధ్యాహ్న భోజనం వండుతున్న సిబ్బందిని శాలువాతో సత్కరించి వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ఏస్. శ్యాంసుందర్, హెడ్మాస్టర్ జె. పురుషోత్తం పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking