భద్రతా నియమాలను పాటిస్తే రోడ్డు ప్రమాదాలను నివారించగలము ఆర్టీవో

రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

ఖమ్మం ప్రతినిధి జనవరి 23 (ప్రజాబలం) ఖమ్మం
భద్రతా నియమాలను పాటిస్తే రోడ్డు ప్రమాదాల ను నివారించగలమని ఆర్టీవో వెంకట రమణ అన్నారు. రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా నగరంలోని బ్లుమింగ్ మైండ్ స్కూల్ విద్యార్థుల కు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు సేఫ్టీ గురించి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తెలుసు కోవాల్సిన బాధ్యత కలిగి ఉండాలన్నారు దేశంలో ప్రతి ఆర్టీసీ నిమిషానికి ఒక రోడ్డు ప్రమాదం జరుగుతుండగా, ప్రతి మూడు నిమిషాలకు అదే రోడ్డు ప్రమాదంలో ఒకరు మృత్యువాత పడుతున్నారని తెలిపారు ఎక్కువ శాతం అధిక వేగంతో రోడ్డుపై వాహనాలను నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం జరుగు తుందని వాపోయారు రోడ్డుపై వాహనాలు నడిపే ప్రతి ఒక్క వ్యక్తి రూల్స్ ను పాటించి ఇతరులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా వాహనాలను నడపాలని సూచించారు. ఈ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి వాటిపై పూర్తిస్థాయి అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని చెప్పారుట్రాఫిక్ రిజర్వ్ ఇన్స్‌పెక్టర్ సాంబశివరావు మాట్లాడుతూ వాహనదారులు బయటకు వెళ్లేటప్పుడు, కుటుంబ సభ్యులు తమ కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తుంటారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ప్రమాదాల్లో పెద్ద దిక్కును కోల్పోతే కుటుంబం మొత్తం రోడ్డున పడుతుందన్నారు. కాబట్టి వాహనం నడిపేట ప్పుడు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని సూచించారు ద్విచక్ర వాహన దారులు హెల్మెట్‌ ధరించాలని, కార్లు నడిపేవారు సీటు బెల్టు పెట్టుకోవాలని అతివేగం అనర్థదాయకమని మద్యం తాగి వాహనం నడపవద్దని చెప్పారు ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేయొద్దని హెచ్చరించారు. ఈ విషయాలను ప్రతి వాహనదారులు గమ నించాలని సూచించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking