వైద్య విద్యార్థులకు ర్యాగింగ్ పై అవగాహన నిర్వహించిన ఏసిపి.
వరంగల్ ప్రజాబలం ప్రతినిధి డిసెంబర్ 15:
ర్యాగింగ్ భూతంతో జీవితాలను నాశనం చేసుకోవద్దని వరంగల్ ఏసిపి బోనాల కిషన్ వెల్లడించారు.
గురువారం కాకతీయ మెడికల్ కళాశాల లోని ఫస్ట్ ఇయర్ వైద్య విద్యార్థులకు కెఎంసి ప్రిన్సిపల్ దివ్వెల మోహన్ దాస్ తో కలిసి ర్యాగింగ్ , సామాజిక బాధ్యతపై అవగాహనను కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య వృత్తి తీసుకున్న వారు బాధ్యతతో నడుచుకోవాలని తోటి విద్యార్థుల పట్ల స్నేహపూర్వకంగా ఉండాలని అన్నారు ర్యాగింగ్ అనేది ఒక భూతంలా తయారయిందని, ర్యాగింగ్ చేసి ఇతరులను బాధపెట్టి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. రాగింగ్ చేసి విలువైన భవిష్యత్తును నాశనం చేసుకున్నా ఎంతోమంది విద్యార్థులను మనము కళ్ళముందు చూసామని అది గమనించి ఎవరు ర్యాగింగ్ జోలికి పోవద్దని అన్నారు. ఎవరైనా ర్యాగింగ్ చేసినట్లు తెలిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని అన్నారు. ర్యాగింగ్ చేస్తున్నా వారి వివరాలను పోలీసులకు తెలియజేయాలని వైద్య విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మట్టేవాడ సిఐ ఎన్ వెంకటేశ్వర్లు, పోలీస్ సిబ్బంది వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.