వరంగల్ ప్రజాబలం ప్రతినిధి డిసెంబర్ 15:
తెలంగాణ రాష్ట్ర మూడవ శాసనసభకు ఎన్నికైన వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట,నర్సంపేట , పరకాల శాసనసభ్యులు నాయిని రాజేందర్రెడ్డి, కే అర్ నాగరాజు, రేవూరి ప్రకాష్ రెడ్డి, దొంతి మాధవరెడ్డి లను సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ విద్యారణ్యపురి , ఓరుగల్లు వినియోగదారుల రక్షణ సమితి విద్యారణ్యపురి గోపాలపురం హనుమకొండ జిల్లా ఉభయ స్వచ్ఛంద సంస్థల పక్షాన మర్యాదపూర్వకంగా పుష్పగుచ్చాలతో శాలువాలతో సత్కరించినారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు వృద్ధుల పోషణ సంరక్షణ చట్టం 2007 నియమావళి 2011 వినియోగదారుల రక్షణ చట్టం 2019 అమలులో సహకరించాలని అన్నారు. మా లక్ష్యం వృద్ధులను గౌరవిద్దాం వినియోగదారుడే రారాజు అను నినాదాలతో ముందుకు సాగుతున్న మా ఉద్యమానికి స్వచ్ఛంద సంస్థలకు సహాయ సహకారాలు అందించాలని అన్నారు. ఈ సందర్భంగా ప్రతినిధి వర్గం కోరారు. తమ వంతు సహకారం అందిస్తామని సానుకూలంగా శాసనసభ్యులు స్పందించినరూ ప్రతినిధి వర్గంలో దామర నర్సయ్య, అధ్యక్షులు ఆర్టీడీ డీఎస్పీ నాగులగాం నరసయ్య, ఉపాధ్యక్షులు కజాంపురం, దామోదర్, సి డబ్ల్యూ సి మెంబర్ తేరాల యుగంధర్, కార్యదర్శి గోకారపు రాజేందర్, గంటి సాంబయ్య, గంగారపు యాదగిరి, పిట్టల సాంబయ్య, వర్ధిల్లి మల్హల్ రావు, రాజమౌళి , వెలుదండి శ్రీనివాస్, డాక్టర్ రాజేంద్రప్రసాద్, తేరాల యుగంధర్ సంస్థ ప్రతినిధులు పాల్గొని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.