ఎన్నికల నిర్వహణలో పోలీస్ అధికారులు, సిబ్బంది పనితీరు అభినందనీయం. నిర్మల్ జిల్లా ఎస్పీ చల్లా ప్రవీణ్ కుమార్
ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..
సమన్వయంతో పనిచేసి ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడంలో కీలకముగా నిలిచిన పోలీస్ అధికారులు, సిబ్బంది పనితీరు అభినందనీయమని జిల్లా ఎస్పీ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర శాసన ఎన్నికలను విజయంగా నిర్వహించండంలో శ్రమించిన పోలీస్ అధికారులు, సిబ్బందికి ఎస్పీ గురువారం ప్రశంసా పత్రాలను అందజేశారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.ఎలాంటి సంఘటనలు జరగకుండా పూర్తిగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికల విధుల నిర్వహణలో అధికారులు, సిబ్బంది శ్రమించిన తీరు స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఈ ఎన్నికల్లో పోలీసులు ఇతర ప్రభుత్వ శాఖలతో సమన్వయము పనిచేయడం ద్వారా ఎన్నికల నిర్వహణ మరింత సులభతరం అయిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ వీరన్న, ఏఎస్పీ భైంసా కాంతిలాల్ పాటిల్ ఐపిఎస్., అదనపు ఎస్పీ (ఏఆర్) వెంకటేశ్వర్లు, సిసిఆర్బి రవీందర్ రెడ్డి, ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఇన్స్ స్పెక్టర్లు పురషోతం చ్యారి, మోహన్, నైలు, వినోద్, నవీన్ కుమార్, ఆర్ఐలు రాంనిరంజన్, రమేష్, రామకృష్ణ, యంటిఓ వినోద్, ఐటి కోర్ ఎస్ఐ రవి కుమార్, సబ్ ఇన్స్ స్పెక్టర్లు, ఇతర పోలీస్ సిబ్బంది వున్నారు