300 మంది కి ఉచితంగా కంటి అద్దాలు అందించడం
70 మంది కి శస్త్ర చికిత్స త్వరలో
బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెర్రబెల్లి
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి డిసెంబర్ 14 : మంచిర్యాల బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో హాజీపూర్ మండల కేంద్రమంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో వివిధ గ్రామాల నుండి 400 మందికి పైగా ప్రజలు ఉచిత కంటి వైద్య పరీక్షలు చేయించుకోవడం జరిగింది. కంటి పరీక్షలు చేయించుకున్న 300 పైగా మందికి బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి ఉచితంగా కంటి అద్దాలు అందించడం జరిగింది.శస్త్ర చికిత్స అవసరం ఉన్న 70 మందికి త్వరలోనే ఉచితంగా శస్త్ర చికిత్స చేయించడం జరుగుతుంది.రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామని రఘునాథ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ జిల్లా నాయకులు,మండల నాయకులు కార్యకర్తలు, బీజేవైఎమ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
