బీఆర్ఎస్ పార్టీకి షాక్ కాంగ్రెస్ పార్టీలో చేరిన 8 మంది కౌన్సిలర్

కాంగ్రెస్ పార్టీకి కండువా కప్పి ఆహ్వానించినా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి డిసెంబర్ 14 : బీఆర్ఎస్ పార్టీకి షాక్ కాంగ్రెస్ పార్టీలో చేరిన 8 మంది కౌన్సిలర్, హైదరాబాద్ లోని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించారు.గురువారంఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… మంచిర్యాల పట్టణంలోని 7,9,19,22,25, 26,27,వార్డులోని బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్స్ కాంగ్రెస్ పార్టీకి చేరారు. కాంగ్రెస్ తోనే సమస్యలు పరిష్కారం అవుతాయని మంచిర్యాల కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరినట్లు తెలుపారు,కాంగ్రెస్ పార్టీకి చెరిన వారు మంచిర్యాల మున్సిపాలిటీ పరిదిలోని 7వ వార్డు కౌన్సిలర్ ప్రకాష్ నాయక్,9వ వార్డు కౌన్సిలర్ బొలిశెట్టి సునీత-కిషన్,19వ వార్డు కౌన్సిలర్ వంగపల్లి అనిత- రవీందర్ రావు,22 వ వార్డు కౌన్సిలర్ మేరుగు మహేశ్వరి-శ్రీనివాస్,25వ వార్డు కౌన్సిలర్ మీనాజ్ గారు,26వ వార్డు కౌన్సిలర్ నాంపల్లి మాధవి-శ్రీనివాస్, 27వ వార్డు కౌన్సిలర్ సిరికొండ పద్మ-కొండల్ రావు,34వ వార్డు కౌన్సిలర్ మాదం శెట్టి సత్యనారాయణ,బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు ఖాజామియా,బోడ ధర్మేందర్, తూముల ప్రభాకర్,కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది తెలుపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తుమ్మల నరేష్ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking