ప్రజాభిమతమే నా అభిమతం…
ప్రజలకు నష్టం జరిగితే సహించను
ఇప్పటికే విలువైన భూములు కోల్పోయారు
డోర్నకల్ – మిర్యాలగూడ రైల్వే లైన్ అలైన్మెంట్ పున:పరిశీలన చేయండి
లోక్ సభలో డోర్నకల్ – మిర్యాలగూడ రైల్వే లైన్ పై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఎంపీ నామ నాగేశ్వరరావు
ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 07 (ప్రజాబలం) ఖమ్మం ప్రజలకు, రైతులకు ఎంతో ఇబ్బంది కరంగా, నష్టదాయ కంగా పరిణమించిన ప్రతి పాదిత డోర్నకల్- మిర్యాల గూడ రైల్వే లైన్ అలైన్మెంట్ పున:పరిశీలన చేయాల్సిందేన ని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వర రావు లోక్ సభ సాక్షిగా అనేక రూపాల్లో కేంద్ర ప్రభుత్వం పై పెద్ద ఎత్తున వత్తిడి తీసుకొస్తు న్నారు. ఈ నేపధ్యంలో ఈ విషయమై బుధవారం కూడా లోక్ సభలో బలంగా ప్రస్తా వించి, కేంద్రంపై మరింత వత్తిడి పెంచారు. దక్షి ణ మధ్య రైల్వేలో కొత్తగా ప్రతిపాదించ బడిన డోర్నకల్- మిర్యాలగూడ రైల్వే లైన్ అలైన్మెంట్ పురోగతి ఎంత వరకు వచ్చిందని, ఈ విష యమై తాను ప్రతిపాదించి న అంశాలను పరిగణలోకి తీసుకున్నారా అని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ను ప్రశ్నించారు.సారవంతమైన వ్యవసాయ భూములను కాపాడుకునేందుకు అనేక గ్రామాల రైతులు అలైన్‌మెంట్ మార్చాలని డిమాండ్ చేస్తున్నా రని మరోసారి గుర్తు చేశారు. అలైన్‌మెంట్‌ను మార్చడానికి తీసుకున్న చర్యలేమిటని కేంద్రాన్ని అడిగారు.ప్రతిపాదిత మార్గంలో ఎంతో విలువైన భూములు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, పేదల ఇండ్లు ఉన్నాయి కనుక అలైన్మెంట్ మార్చాలని ఎంపీ రైల్వే మంత్రిని కోరారు.ఈ విషయమై ప్రస్తుత లైన్‌ను ఉద్దేశించిన ప్రయోజనం కోసం ఉపయోగిం చుకోవడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటి? అని నిలదీశారు. ప్రజల అభిమతమే తన అభిమత మని, వారికి నష్టం కలిగే దేనిని సహించనని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలైన్మెంట్ మార్చాల్సిందేనని నామ కేంద్రానికి తేల్చి చెప్పి, పట్టుబ డుతున్నారు. ఇప్పటికే జాతీయ రహదారులు, నాగార్జున సాగర్, ఇతర వాటి వల్ల రైతులు తమ విలువైన భూములను కోల్పోయి, నష్టపోయారని, మళ్లీ ఇప్పుడు కూడా ఉన్న కాస్త భూములను కోల్పోవడానికి సిద్దంగా లేరని నామ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్ళారు.
ఏదైనా డీపీఆర్ తర్వాతేనంటా
ఈ విషయమై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వివరణ ఇస్తూ డోర్నకల్- మిర్యాలగూడ (97 కి.మీ) మధ్య కొత్త రైలు మార్గం కోసం సర్వే మంజూరు చేయబడిందని, వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదిక (డిపిఆర్) తయారీ కోసం సర్వే పనులు చేపట్టబడ్డాయని తెలిపారు. రైల్వే ప్రాజెక్టుల అమరిక, కార్యాచరణ వాణిజ్య అవసరాలు, సాంకేతిక-ఆర్థిక సాధ్యత, సామాజిక-ఆర్థిక తదితర అంశాలు పరిగణలోకి తీసుకుని, వాటి ఆధారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి చెప్పారు. వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్) సిద్ధమైన తర్వాత తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని మంత్రి వెల్లడించారు