బిఆర్ఎస్ నేతలు ఒళ్ళు దగ్గరపెట్టుకోవాలి
అవాకులు చెవాకులు పేలితే చూస్తూ ఊరుకోం
ఇకనైనా బూతుల సంస్క్రుతి మార్చుకోండి
బిఆర్ఎస్ నేతలపై మహమ్మద్ జావేద్ ఫైర్
ఖమ్మం ప్రతినిధి జనవరి 7 (ప్రజాబలం) ఖమ్మం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలు ప్రకటించిన విధంగా 6 గ్యారంటీల అమలకు కట్టుబడి ఉందని ఓటమిపాలైన టిఆర్ఎస్ నాయకులు అసహనానికి లోనై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్ స్పష్టం చేశారు. బుధవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టిఆర్ఎస్ నాయకుల తీరుపై ఫైర్ అయ్యారు.ఓటమిని జీర్ణించుకోలేని బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్పై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రిపై నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఇలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కాంగ్రెస్ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. మిగులు బడ్జెట్ గా ఉన్న రాష్ట్రాన్ని సోనియమ్మ అప్పగిస్తే ఏడు లక్షల కోట్ల అప్పులు చేసి ఖాళీ ఖజానా అప్పగించారని విమర్శించారు. ఓటమిపాలైన బిఆర్ఎస్ నాయకులను ప్రజల ఎవరు పట్టించుకోక పోవడంతో బూతుల పురాణం మొదలుపెట్టి పబ్లిసిటీ అవ్వాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన వ్యక్తిపై చెప్పుతీసి చూపించడం బిఆర్ఎస్ నాయకుల అజ్ఞానానికి నిదర్శనం అని అన్నారు. ఇలాంటి అజ్ఞానుల చేతిలోన పదేండ్ల తెలంగాణలో పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. యథా రాజా తథా ప్రజా అన్నట్టు రాజు మంచిగా మాట్లాడితే సైనికులు మంచిగా మాట్లాడుతారు కానీ రాష్ట్రంలో బూతుల పురాణం మొదలు పెట్టింది బీఆర్ఎస్ అని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొద్దిరోజుల్లోనే ఆరుగారెంటీలు అమలకు శ్రీకారం చుట్టిందని, రెండు గ్యారెంటీలకు కసరత్తు ప్రారంభించిందని తెలిపారు. రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉన్న ఇచ్చిన మాట ప్రకారం ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన ప్రతి హామీ నెరవేర్చడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లోను కాంగ్రెస్ భారీ మెజారిటీతో గెలవబోతుందని జోస్యం చెప్పారు. పార్లమెంటు ఎన్నికల్లోను బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా నోచుకోదని అన్నారు. ఇప్పటికైనా బిఆర్ఎస్ నేతలు ఒళ్ళు దగ్గర పెట్టుకోని మాట్లాడాలని హెచ్చరించారు. 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ మంచి చేసి ఉంటే ప్రజలు గెలిపించే వారని, ప్రజాతీర్పును గౌరవించకుండా అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు లాకవత్ సైదులు, రఫీద ముస్తఫా, పల్లెబాయిన భారతీ చంద్రం,జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బాల సౌజన్య, రాష్ట్ర మైనారిటీ సెల్ జనరల్ సెక్రటరీ రబ్బానీ, మైనారిటీ జిల్లా అద్యక్షులు హుస్సేన్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా ఉప అద్యక్షులు కొంగేముక్కుల నాగేశ్వరరావు, కోటేరు నర్సిరెడ్డి, ఎస్టీ సెల్ నగర అధ్యక్షుడు దేవత్ శంకర్ నాయక్, ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడు గడ్డి కొప్పుల ఆనందరావు, గజ్జీ సూరిబాబు, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ ఏలూరి రవికుమార్ ఎన్ ఎస్ యు ఐ నగర అధ్యక్షుడు పేరం యశ్వంత్, డివిజన్ అద్యక్షులు శ్రీ శైలం, తది తరులు పాల్గొన్నారు.