లక్షెట్టిపేటకు నూతన సీఐగా అల్లం నరేందర్ బాధ్యతల స్వీకరణ

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 07 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట పోలీస్ స్టేషన్ సర్కిల్ కార్యాలయంలో నూతన సీఐగా అల్లం నరేందర్ బాధ్యతలు తీసుకున్నారు.బుదవారం ఇంతకాలం ఇక్కడ సీఐగా విధులు నిర్వహించిన కృష్ణ పెద్దపల్లి పోలిస్ స్టేషన్ కి బదిలీ కావడంలో ఆయన స్థానంలో ఇంతకాలం రెబ్బనలో సీఐగా విధులు నిర్వహించి ఇక్కడికి బదిలీపై వచ్చి పూర్తి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. నూతనంగా బాధ్యతలు తీసుకున్న సీఐకి లక్షెట్టిపేట, దండేపల్లి,జన్నారం ఎస్సైలు లక్ష్మణ్,ప్రసాద్,సతీష్ పుష్పగుచం అందజేసి స్వాగతం పలికారు. వీరితో పాట స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking