ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 7: నేటి మహిళలకు ఆదర్శం రమాబాయి అంబేద్కర్ అని,ఆమె ఆశయాలను కొనసాగించాలని, అంబేద్కర్ యువజన సంఘం పట్టణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తొగరి రాజు, అల్లంపల్లి రమేష్ పేర్కొన్నారు. లక్షెట్టిపేట పట్టణంలోని మోదెలలో త్యాగశీలి రమాబాయి జయంతిని మోదెల యువత ఘనంగా నిర్వహించారు. బుధవారం ఆ సంఘం మండల,పట్టణ, స్థానిక నాయకులతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…ఆమె పొరాటం సామాన్య మైనదని, అసామాన్యమైన త్యాగఫలమని,”త్యాగం” అనే మాట కూడా ఆ కరుణామయరాలికి జోడించగానే దాని విలువ పెరుగుతుందనడంలో సందేహం లేదన్నారు.డా.అంబేడ్కర్ ఈ దేశానికి,స్త్రీలకు,అట్టడుగు వర్గాలకు,బి సి లకు చేసిన త్యాగం ఎన్నటికీ, ఎప్పటికీ మరువలేనిదన్నారు.కానీ చరిత్ర గుర్తించని,మరుగున పడిన మహనీయ చరిత తల్లి రమాబాయిదన్నారు.భర్త భవిష్యత్తు కోసం,జాతి భవితవ్యం కోసం వేగంగా పరుగులెడుతుంటే ఆ మార్గంలో కుటుంబ సమస్యలు అనే ముల్లు మనకు గుచ్చు కోకుండా ఉండటానికి ఆ ముల్లుపై ఆమె చేతులు పెట్టి రక్తపు గాయాలతో ఆయనను మరింత ముందుకు నడిపించిందన్నారు.తన కడుపున పుట్టిన బిడ్డలు తన కళ్ళెదుటనే చనిపోతున్నా, ఐదుగురు బిడ్డల్లో నలుగురు పిల్లలు ఒకరి తర్వాత ఒకరిగా ఆకలితోనూ,సరైన వైద్యం అందక మరణిస్తున్నా కడుపు కోతను భరిస్తూ భర్తను ఉద్యమంలో మరింత ముందుకు నడిపిస్తూ,పేడతట్ట నెత్తి మీద పెట్టుకొని, పిడకలు అమ్మి, పిల్లలు ఆకలి తీరుస్తూ, ఏడు కోట్ల మంది అంటరాని బతుకులలో వెలుగులు చిమ్మటానికి భర్త అందరికి దీపంలా వెలగటానికి , ముందుకు సాగటానికి ఆమె తన రక్తాన్నే చమురుగా మార్చిందన్నారు. చివరకు రక్తహీనతతో 35 ఏళ్ళకే మరణించిందని, ఆమె చేసిన త్యాగం,పోరాటం ఎప్పటికీ మరువలేనిదన్నారు.ఈ దేశం బంగారు భవిత కోసం సగానికిపైగా ఉన్న మహిళలు తమ దిశను తల్లి రమాబాయి వైపు నుంచి చూసుకుంటే ఆ కుటుంబం సమాజానికి చిరుదివ్వెలుగా వెలుగుతుందన్నారు.జాతి కోసం, బడుగుల కోసం,భర్త కోసం త్యాగం చేసిన మహానీయురాలు తల్లి రామాబాయని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు దమ్మ నారాయణ,జిల్లా నాయకులు మాలెం చిన్నన్న, అంబేద్కర్ సంఘం మండల వైస్ అధ్యక్షుడు బైరం లింగన్న,ప్రేమ్ సాగర్,కోడి కుమార్,మామిడి సందీప్,కల్లేపల్లి విక్రమ్, తదితరులు పాల్గొన్నారు.