గ్రామ పంచాయతీ పరిధిలోగల అని కేంద్రాలలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలి జిల్లా కలెక్టర్ ప్రియాంక అల
భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి ఫిబ్రవరి 07 (ప్రజాబలం) భద్రాద్రి కొత్తగూడెం గ్రామ పంచాయితీల పరిధిలోని అన్ని పాఠశాలలు, అంగన్ వాడి కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప ఆరోగ్య కేంద్రాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తెలిపారు. పల్లెలు అభివృద్ధికి ప్రభుత్వం ఈ నెల 7వ తేదీ నుండి 15వ తేదీ వరకు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టినట్లు చెప్పారు. ఈ ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాల్లో బాగంగా ఫిబ్రవరి 8వ తేదీన యువత, మహిళలు, గ్రామ ప్రజలు, ప్రముఖులు, అధికారులతో శ్రమదానం నిర్వహించాలని చెప్పారు. ఇట్టి కార్యక్రమంలో ప్రజలకు తడి పొడి చెత్త వేరు చేయడంపై అవగాహన కల్పించాలని చెప్పారు రహదారులపై ఉన్న గుంతలను పూడ్చివేయాలని చెప్పారు రహదారులపై చెత్తకుప్పలు, మట్టి దిబ్బలను తొలగించి పరిశుభ్రం కలెక్టర్ పేర్కొన్నారు.