గురువుగా ప్రిన్సిపల్ ఫాదర్ ప్రసాద్ 25 వసంతోత్సవ సేవలు అభినందనీయం
వెరీ రెవరెండ్ ఫాదర్ సురేష్ బాబు
ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 7 (ప్రజాబలం) ఖమ్మం విద్యార్ధులకు విద్యాబుద్దులు నేర్పడంలో గురువుగా 25 వసంతాల అనుభవాన్ని గడించి సిల్వర్ జూబిలీ వేడుక ఖమ్మం బల్లేపల్లి ఎస్ ఎఫ్ ఎస్ స్కూల్లో కరస్పాండెంట్ అండ్ ప్రిన్సిపల్గా విధులు నిర్వర్తించి విద్యార్ధుల, మరియు చిన్నారుల తల్లిదండ్రుల మరియు జిల్లా అధికారుల ప్రశంసలు పొందడం ఎస్ ఎఫ్ ఎస్ పాఠశాలకే గర్వకారణమని ఎమ్మెస్ ఎఫ్ ఎస్ విశాఖపట్నం వెరీ రెవరెండ్ ఫాదర్ బవిరి సురేష్ బాబు అన్నారు.. ఖమ్మoలోని బల్లేపల్లి ఎస్ ఎఫ్ ఎస్ స్కూల్ పాఠశాలలో జరిగిన సిల్వర్ జూబిలీ వేడుకలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మరియు ప్రొవిన్షియల్ కౌన్సిలర్ రెవరెండ్ ఫాదర్ జోసప్ రెడ్డి గారు అలాగే అతిరధ మహారధులు జూబిలి మహోత్సవ పూజలో పాల్గొని ఫాదర్ బొంతుప్రసాద్ కు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రొవిన్షియల్ ఫాదర్ సురేష్ బాబూ మాట్లాడుతూ గురుత్వం అనేది గొప్పవరం అని ఆవిధంగా జీవించడం అనేది మహా సుకృతం, ఈ లోకంలో జీవించేది ఒక్కసారి అయిన అలా జీవించిన ఆ ఒకసారి కూడా ఈ జీవితాన్ని దేవుని సేవకు అంకితం చేయడం అన్నది నిజంగా చాలా గొప్ప విషయమన్నారు.. ఈకార్యక్రమంలో ఆరోగ్యమాత విచారణ గరువులు, ఇతర గురువులు, సిస్టర్స్, బ్రదర్స్, మరియు విచారణ సంఘ ప్రజలు పెద్ద మొత్తంలో పాల్గొని ఫాదర్ ప్రసాద్ జూబిలి మహోత్సవాన్ని జయప్రదం చేశారు తొలుత ఈవేడుకకు హాజరైన అతిరథ మహారధులు ప్రిన్సిపల్ ఫాదర్ బొంతు ప్రసాద్ ను శాలువాతో ఘనoగా సత్కరించారు… ఆనంతరం ప్రిన్సిపల్ ఫాదర్ ప్రసాద్ మాట్లాడుతూ గురువుగా విద్యార్థులకు సేవలు అందించడం నా గురుతర బాధ్యత అని, తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు అని ప్రిన్సిపల్ ఫాదర్ బొంతు ప్రసాద్ పేర్కొన్నారు
