అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా”డబుల్” ఇండ్లు!

 

– అర్హులకు ఇండ్ల పంపిణీ జరిగేదెప్పుడో?
– ఏండ్లు గడుస్తున్నా లభించని మోక్షం
– ప్రభుత్వాలు మారినా పట్టించుకోని వైనం?
జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి జూలై 12

నిరుపేదల సొంతింటి కల నెరవేరుస్తామని గొప్పలు పోయిన గత ప్రభుత్వం.. తప్పకుండా పేదవాడికి ఇల్లు ఇస్తామని పేర్కొంటున్న ప్రస్తుత సర్కారు.. తొలుత నిర్మించిన ఇండ్లను పట్టించుకోవాలని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మితమైన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు సామాన్యులకు ఇవ్వక అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. అసలు ఆ ఇండ్లను పట్టించుకునే నాథుడే లేక వెలవెలబోతున్నాయి.
జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్త మార్కెట్ వెనక నిర్మించిన ‘డబుల్ ‘ ఇండ్లు కొన్ని నిర్మాణం పూర్తికాగా మరికొన్ని అసంపూర్తిగా అలానే ఉండిపోయాయి. దీంతో ఆ పరిసర ప్రాంతాలు ఆకతాయిలకు అడ్డాగా మారిపోయాయని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఆ ప్రదేశాల్లో కొందరు ఇండ్ల లోపలి సామగ్రి ధ్వంసం చేయడంతో పాటు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు.ప్రభుత్వాలు మారినా అర్హులకు ” డబుల్ ” ఇండ్లు అందని ద్రాక్ష గానే మిగిలిపోతున్నాయి. సుమారు 500 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు జమ్మికుంట పట్టణానికి మంజూరు కాగా, అందులో 250 కొత్త మార్కెట్ వెనుక నిర్మించగా, కొన్ని పూర్తయి, మరికొన్ని అసంపూర్తిగా అలానే ఉండిపోయాయి.మారుతి నగర్ లో సుమారు 100 ఇండ్లు మంజూరు కాగా అవి అసలు ప్రారంభమే కాలేదు.ధర్మారంలో సుమారు 150ఇండ్ల నిర్మాణం పూర్తయిన పంపిణీ చేసే నాథుడు లేక లబ్ధిదారులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.

 

                       

Leave A Reply

Your email address will not be published.

Breaking