జిల్లా వ్యాప్తంగా వనమహోత్సవం కార్యక్రమం విజయవంతంగా నిర్వహించాలి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్

 

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జూలై 12:
వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీలకు, ఎంపీడీవోలకు, జిల్లా అధికారులకు కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ సంబంధిత అధికారులకు ఆదేశించారు.
శుక్రవారం రోజున విసి మీటింగ్ హాల్లో ఏర్పాటుచేసిన సమావేశంలో వనమహోత్సవం, అమ్మ ఆదర్శ పాఠశాల , ప్రజాపాలన కేంద్రాలు, మహిళా శక్తి అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వనమహోత్సవం కార్యక్రమం కింద జిల్లాలో 63 లక్షల మొక్కలు నాటే లక్ష్యాన్ని నిర్ణీత వ్యవధిలోగా పూర్తి చేయాలన్నారు. జిల్లాలో మొక్కలు నాటేందుకు రెడీగా ఉన్నా యని తెలిపారు. వర్షాలు కురుస్తున్నందున మొక్కలు బ్రతికే అవకాశం ఎక్కువగా ఉన్నందున మొక్కలు నాటడం మొదలు పెట్టాలన్నారు. ప్రతి ఒక్కరు ఇంటిముందు మొక్కలు నాటేందుకు మొక్కలు పంపిణీ చేయాలన్నారు. చెట్టు పెంచడం వల్ల ఆక్సిజన్ అందుతుందని అందువల్ల మానవ మనుగడకు చెట్లు పెంచడం ఎంతో మేలు చేస్తుందనీ అన్నారు. వన మహోత్సవంలో విరివిరిగా మొక్కలు నాటి పూర్తిస్థాయిలో లక్ష్యాన్ని సాధించాలని అధికారులకు సూచించారు. మున్సిపల్ అధికారులకు,ఎంపీడీవోలకు, జిల్లా అధికారులకు కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయుటకు పక్కా యాక్షన్ ప్లాన్ రూపొందించి మొక్కలు నాటే ప్రదేశాలను గుర్తించాలన్నారు. నాటిన మొక్కలకు ట్రీ గార్డ్ ఏర్పాటు చేసి రక్షణ చర్యలు తీసుకోని మొక్కలను సంరక్షించాలని కలెక్టర్ కోరారు.
జిల్లాలో అమ్మ ఆదర్శ పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులు పూర్తి చేసి ప్రభుత్వ పాఠశాలను అద్భుతంగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు.
అమ్మ ఆదర్శ పాఠశాలలు చేపట్టిన పనులు చాలావరకు పనులు పూర్తయ్యాయని ఇంకను పలు స్కూల్లో వివిధ దశలో కొనసాగుతున్న పనులను పూర్తి చేయించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను కోరారు.
మండలాల వారీగా పనుల పురోగతిపై సమీక్షిస్తూ అధికారులందరూ తమకు కేటాయించిన పనులను పూర్తి చేయాలన్నారు అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా చేపట్టిన మైనర్ రిపేర్లు, ఎలక్ట్రిషన్, త్రాగునీరు టాయిలెట్స్, వంటి మౌలిక వసతుల పనులు చాలావరకు పూర్తయ్యాయని ఇంకా మిగిలి ఉన్న వాటిని త్వరగా పూర్తి చేయాలి అన్నారు. గతంలో పాఠశాలలో ఉన్న పరిస్థితులను అమ్మ ఆదర్శ పాఠశాల పనులు చేపట్టిన తర్వాత పాఠశాలల ఫోటోలను సమర్పించాలన్నారు. నాణ్యత ప్రమాణాలు పాటించేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని సూచించారు. ఎలాంటి నిధుల కొరత లేదన్నారు.
మున్సిపాలిటీ,ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రజా పాలన సేవా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కౌంటర్లు ఉండాలన్నారు. గృహజ్యోతి, మహాలక్ష్మి పథకం కింద వచ్చే దరఖాస్తులను వెనువెంటనే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు అందించిన గృహజ్యోతి, మహాలక్ష్మి ( గ్యాస్) పథకం విజయవంతంగా కొనసాగేలా అమలు తీరును పర్యవేక్షించాలని అధికారులకు ఆదేశించారు. ప్రజా పాలనలో వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్లో డేటా విభాగంలో కంప్యూటర్ చేయడానికి ఆపరేట్లను అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఎక్కువగా దరఖాస్తులు వచ్చినయెడల రెండు సిస్టమ్ లు కూడా ఉపయోగించాలి అన్నారు.
ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఓ సాంబశివరావు, జిల్లా విద్యాశాఖ అధికారి విజయ కుమారి, జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ జానకిరామ్, మున్సిపల్ అధికారులు, ఎంపీడీవోలు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking