జాతీయ బి.సి సంఘం జాతీయ మహిళా అధ్యక్షురాలుగా డా. పద్మ లత

హైదరాబాద్ మే 25 (); జాతీయ బి.సి మహిళా సంఘం జాతీయ అధ్యక్షురాలు డా.ఏ. పద్మ లత నియమితులైనారు ఈ మేరకు జాతీయ బి.సి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య నియామక పత్రాన్ని అందజేశారు.ఈ సందర్బంగా ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ పార్లమెంట్ లో మహిళా బిల్లు పెట్టి మహిళలకు చట్ట సభలలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, అలాగే మహిళ బిల్లులో బి.సి. మహిళలకు సబ్ కోటా కల్పించినప్పుడే బి.సి. మహిళల కు రాజ్యాధికారం దక్కుతుంది అని అన్నారు. పార్లమెంటులో ప్రవేశపెట్టిన మహిళ బిల్లులో బి.సి. మహిళలకు జనాభా ప్రకారం సబ్-కోటా ఇవ్వాలని ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. మహిళ బిల్లులో బి.సి మహిళలకు ప్రాతినిధ్యం కల్పించకపోతే మహిళ బిల్లుకు సార్ధకత లేదన్నారు. ఇప్పటికే మహిళ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందింది. లోక్ సభలో కూడా పెట్టి పూర్తి చేయాలని కోరారు. మహిళా బిల్లు గురించి గొంతులు చించుకొని మాట్లాడే రాజకీయ పార్టీల నాయకులు బి.సి మహిళల గురించి, వారికి జరుగుతున్న అన్యాయాల గురించి, అత్యాచారాల గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. అసెంబ్లీ లో మొక్కుబడిగా తీర్మాణం చేసి చేతులు దులుపుకుంటే సరిపోతుందా? అని ఆయన ప్రశ్నించారు. మహిళ బిల్లు పాస్ కావాలంటే బి.సి మహిళలకు సబ్-కోటా ఇవ్వక తప్పదు. జనాభాలో సగం ఉన్న బి.సి.మహిళలకు కోటా ఇవ్వకుండా మహిళల గురించి మాట్లాడటం అన్యాయమన్నారు. అనంతరం డా.ఏ. పద్మ లత మాట్లాడుతూ దేశం లో బిసి మహిళల హక్కుల కోసం తనవంతు కృషి చేస్తానన్నారు.మహిళలు ఒంటింటి కే పరిమితం కారాదని రాజ్యాధికారం లో వాట దక్కినపుడే మహిలా సాదికరికత కు సార్ధకత చేకురగాలదన్నారు. నేడు సమాజం లో మహిళలపై అత్యాచారాలు,వేదింపులు, హత్యలు జరుగుతున్నా వీరి రక్షణ్ కోసం చేసిన చట్టాలు కేవలం కాగితాలకీ పరిమితమైనాయని విమర్శించారు.మహిళా చట్టాలు పకత్బందిగా అమలు చేయాలని పద్మ లత కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేసారు.తమపై గల నమ్మకం తో తనను జాతీయ బి.సి మహిళా సంఘం జాతీయ అధ్యక్షురాలు నియమించిన ఆర్.కృష్ణయ్య కు కృతఙ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో ఎర్ర సత్యనారాయణ, సి రాజేందర్ ,నాని ముదిరాజ్, కుమార్ యాదవ్, సత్తిబాబు, జీపీటీ కుమార్, పెంకే శ్రీనివాస్, పి. భూషణం తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking