ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే హజ్ యాత్రకు వెళ్ళే వారికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సహకారం అందిస్తుందని మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ అన్నారు.నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఐఏ ఫంక్షన్ హాల్ లో హజ్ యాత్రికులకు గురువారం ఆరోగ్య పరీక్షలు,టీకా వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. హజ్‌యాత్రకు వెళ్ళే యాత్రికులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని అన్నారు. హజ్ ఎంతో పవిత్రమైందని, ఆర్థిక స్తోమత లేని వారికి సైతం ప్రభుత్వం యాత్రకు వెళ్లే ఏర్పాట్లు కల్పిస్తుందని తెలిపారు. రాష్ట్ర మంత్రి వర్యులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గారి సహకారంతో నిర్మల్ లో హజ్ హౌస్ భవన నిర్మాణానికి స్థలం కేటాయిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో హజ్ కమిటీ రాష్ట్ర సభ్యులు యం.డి నజీరుద్దీన్,
మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక రమణ,
యం.డి హాయాద్ , వహిద్ ఖాన్,మన్సూర్ హై మద్, అక్రమ్ అలీ.డా.నయనా రెడ్డి,డా.రాజేంద్రప్రసాద్, డా.వేణు గోపాల్, డా.మతిన్,కాదీర్,జమిల్ ఖాన్,వైద్య ఆరోగ్య సిబ్బంది తదితరులు ఉన్నారు.