ధాన్యం కొనుగోలుపై సంప్రదించకుండానే అసత్య ప్రచారాలు తగదు

ప్రభుత్వ ఉద్యోగులపై అసత్య ప్రచారాలు చేయరాదు.
రైతుల అభివృద్ధే మా ప్రధాన లక్ష్యం.

తూప్రాన్ మండల తాసిల్దార్ జ్ఞాన జ్యోతి.

మెదక్ బ్యూరో// ప్రజా బలం న్యూస్ :-

మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు కొన్ని రోజులుగా చేయడం లేదని పలువురు రైతులు మున్సిపాలిటీలో లోని రోడ్డుపై నిరసన తెలిపారు. మరి ధాన్యం కొనుగోలు విషయమై తూప్రాన్ తాసిల్దార్ జ్ఞాన జ్యోతిని వివరణ కోరగా రైతులు నా దగ్గరికి రాకుండానే అసత్య ప్రచారాలు చేస్తున్నారని, ఒక్క లారీ ధాన్యం కొనుగోలు చేయడానికి ఉన్నదని, రెండు మూడు రోజులు నుండి వరి ధాన్యం కొనుగోలు వద్దనే ఉండి సమస్యలు తెలుసుకోవడం జరిగిందని, సదరు రైతులు ధాన్యం లేనప్పటికీ నాపై అసత్య ప్రచారాలు చేయడం జరిగిందని, ధాన్యం అన్లోడ్ చేసేందుకు లారీలను ఏర్పాటు చేయడం జరిగింది , కొందరు ప్రజాప్రతినిధులు నేను నిజాయితీగా డ్యూటీ చేస్తుంటే వారి అవినీతి కుంభకోణాలకు సహకరిస్తాలేనని కొందరు ప్రజాప్రతినిధులు కావాలని రైతులను రెచ్చగొట్టి , వారి ద్వారా నాపై కోపం సాధిస్తున్నారని కొందరు రైతులు కావాలని పని కట్టుకొని అసత్య ప్రచారాలు చేయడం జరిగిందని తూప్రాన్ తాసిల్దార్ జ్ఞాన జ్యోతి మీడియాతో తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking