*తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి.
మెదక్ ప్రజా బలం న్యూస్ :-
స్వాతంత్ర సమరయోధులు, మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా
ఈరోజు మనోహరాబాద్ మండలంలోని కాళ్లకల్ గ్రామంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రావ్ గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని విగ్రహ ఆవిష్కరణ చేసిన తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారు స్వతంత్ర సమరయోధుడిగా సంఘసంస్కర్తగా తన పరిపాలన దక్షతతో అఖండ భారతావనికి విశేష సేవలు అందించారని గుర్తు చేస్తూ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారికి ఘన నివాళులర్పించారు
అణగారిన వర్గాల అభ్యున్నతికి బాబూ డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ గారు చేసిన సేవలు ప్రజల స్మృతిలో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. బీఆర్ అంబేద్కర్, బాబూ జగ్జీవన్ రామ్ ల కృషి వల్లనే దేశం లౌకికవాదం, సమానత్వం వైపు పయనిస్తోందన్నారు.
బడుగు, బలహీన వర్గాల ప్రజల్లో వెలుగులు నింపడానికి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారు ఎంతో కృషి చేశారన్నారు. పరిపాలనా దక్షత, ప్రజల పట్ల ఎనలేని ప్రేమ, నిస్వార్థ సేవలతో తిరుగులేని నాయకుడిగా గుర్తింపు పొందారని, ఉప ప్రధానిగా భారత దేశానికి విశేష సేవలు అందించారని తెలిపారు. స్వాతంత్రోద్యమం, సామాజిక సంస్కరణోద్యమాలు కన్న ముద్దు బిడ్డ డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ అని కీర్తించారు. సామాజిక సంస్కరణోద్యమాల్లో జగ్జీవన్‌రామ్ విశిష్టమైన స్థానాన్ని పదిల పరుచుకున్నారన్నారు. అటువంటి ఎందరో మహనీయుల కలలు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో సాకారమవుతున్నాయన్నారు
ఈ కార్యక్రమంలో ఎంపీపీ పురం నవనీత రవి ముదిరాజ్, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు మహేష్, అరుంధతి సేవాసమితి సభ్యులు మురళి, అధ్యక్షులు కర్రే కుమార్, నర్సింలు, రామస్వామి, అనిల్, గ్రామ సర్పంచ్ మరియు వార్డు సభ్యులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.