గోషామహల్ ప్రజాబలం ప్రతినిధి: గోషామహల్ అసెంబ్లీ నియోజక వర్గానికి చెందిన కాంగ్రెస్ సీనీయర్ నాయకులు మాజీ మంత్రి ఎం.ముఖేష్‌గౌడ్ గోషామహల్ అసెంబ్లీ నియోజక వర్గ పర్సనల్ సెక్రటరీగా ఉన్న బద్దం సతీష్‌గౌడ్ బుధవారంనాడు బీఆర్‌ఎస్ పార్టీలో చేరడం జరిగినది.బద్దం సతీష్‌గౌడ్‌కు రాష్ట్ర మంత్రివర్యులు టీ శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలుకుతూ బీఆర్‌ఎస్ కండువా కప్పి బీఆర్‌ఎస్‌లో చేరినట్టు ప్రకటించారు.ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అభివృద్ది పనులకు ఆకర్షితులై రాష్ట్రంలోని అన్ని పార్టీల కార్యకర్తలు బీఆర్‌ఎస్ వైపు చూస్తున్నారు. ముచ్చటగా మూడవసారి ముఖ్యమంత్రిగా కె.చంద్రశేఖరరావు చూడాలని తెలంగాణా రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు.అనంతరం బద్దం సతీష్‌గౌడ్ మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేర్‌రావు ప్రవేశపెట్టిన పథకాలు షాదీముబారక్, వృధ్దాప్యపించన్లు గత అన్ని ప్రభుత్వాలలో సాధ్యపడని పథకాలు ఈ ప్రభుత్వంలో ప్రవేశపెట్టినందుకు ఆకర్షితుడినై బీఆర్‌ఎస్ పార్టీలో చేరినాను.నాకు బీఆర్‌ఎస్ కండువాకప్పి ఆహ్వానించిన మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.ఈ కార్యక్రమానికి గోషామహల్ అసెంబ్లీ నియోజక వర్గ సీనీయర్ బీఆర్‌ఎస్ నాయకులు తనను ఆహ్వానించి మంత్రి శ్రీనివాస్ యాదవ్ వద్దకు తీసుకెళ్ళిన గడ్డ శ్రీనివాస్‌యాదవ్ నందకిషోర్ వ్యాస్ ,ఆర్‌వి మహేందర్ ,సునీల్‌సాహూ ,జయ్‌శంకర్,మెగానాయక్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
