ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. నిర్మల్, ఏప్రిల్ 5: భారతదేశ మాజీ ఉప ప్రధాని, దళితుల ఆశాజ్యోతి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను నిర్మల్ జిల్లా కేంద్రంలో ఘనంగా జరుపుకున్నారు. డాక్టర్ బీఆర్. అంబేడ్కర్ భవన్ లో బాబూ జగ్జీవన్ రామ్ చిత్రపటానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పూలమాలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. స్వాతంత్ర ఉద్యమంతో పాటు అనంతరం కేంద్ర ప్రభుత్వంలో అనేక పదవులను చేపట్టిన బాబు జగ్జీవన్ రాం దళితుల అభ్యున్నతికి పాటు పడ్డారని అన్నారు. ఇలాంటి స్ఫూర్తిదాయకమైన నేతల ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వం మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ, బీసీల అభ్యున్నతి కోసం పాటు పడుతోందని, వారందరూ ఈ ప్రభుత్వం ఇస్తున్న అవకాశాలు ఉపయోగించుకున్నప్పుడే జగజ్జీవన్ రామ్ ఆశయాలు నెరవేరతాయని నొక్కి చెప్పారు.