కట్టపాయే పట్టా అయే మాయమైన పీతిరి కుంట

 

శివ్వంపేట ఏప్రిల్ 5 ప్రజా బలం న్యూస్

మెదక్ జిల్లా శివ్వంపేట మండల కేంద్రమైన శివ్వంపేట ఉమ్మడి గ్రామ పంచాయతీ పరిధిలోని గూడూరు గ్రామ శివారులో ఉన్న పీతీరికుంటను కొందరు అక్రమంగా కబ్జా చేసి అందులో రియల్ వ్యాపారానికి తెర తీశారు. వివరాల్లోకి వెళితే గూడూర్ గ్రామ శివారులోని పితిరికుంట కట్టను ఇటీవల కొందరూ వ్యక్తులు కబ్జా చేసి చెరువు కట్టాను చీల్చివేసి, జెసిబి, ప్లవ్ టాక్టర్లతో కట్టాను చదును చేసి ప్లాట్లు చేసి విక్రయిస్తున్నారు. గుడినే కాదు గుడిలో ఉన్న లింగాన్ని కూడా మింగుతామని కొందరు కంకణం కట్టుకున్నట్టు ఉన్నారు. వారికి ఏది సరిపోవడం లేదు గుట్టలు, శిఖలు ఆఖరికి చెరువులనే లేకుండా చేస్తున్నారు. కట్టను చీల్చేస్తే కొందరు నాయకులు అడ్డువస్తున్నారని గ్రహించిన సదర్ నాయకుడు వారందరినీ మచ్చిగా చేసుకొని ఆయనకు తోచిన కాడికి వారందరికీ అమ్యామ్యాలను అప్ప చెప్పారు. దీంతో ఎవరు కూడా అటూవైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. ఇదే పీతీరి కుంటా కింద 40 ఎకరాల వరకు వ్యవసాయ సాగు భూములు సాగు లో ఉన్నాయి. ఈరోజు మా గతి ఎం కావాలని, కట్టపాయే చెరువు పట్టా అయే కట్టను చెరిపి, పట్టా చేసి ఇటీవల ఆ భూమిని ఇటీవల రెండు కోట్ల పైనే మార్కెట్లో విక్రయించారు. ఈ భూమిని కొనుగోలు చేసిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పెద్దగుట్ట ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి అందులో ఉన్న దర్గాను తొలగించి, ఆ దర్గా పక్కనే ఉన్న వేప చెట్టును కూల్చివేసి జెసిబి సహాయంతో కూటుతో సహా పెకిలించి బయట పారేశాడు. అందులో ఉన్న వేప చెట్టు పురాతనమైనది కావడంతో కొందరు గ్రామస్తులు కోతను అడ్డుకున్నారు. అయిన హిటాచి సహాయంతో కోత కోసిన దుంగలను డాక్టర్లకు ఎక్కించి విక్రయించారు. చీమ చిటుక్కుమంటే కదిలిపోయే రెవెన్యూ, పోలీసు, ఇరిగేషన్ అధికారులు ఇప్పుడు ఏ పొక్కల పండుకున్నారని గ్రామస్తులు ప్రశ్నించారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ రాజర్షి షా అలాగే జిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని, పీతీరికుంట కబ్జాపై విచారణ జరిపి చెరువును యధావిధిగా ఉంచాలని కొందరి కబంధ హాస్టాల నుంచి పితిరి చెరువుకు విముక్తి కల్పించాలని గూడూరు గ్రామస్తులు రైతులు వేడుకుంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking