బిసి ల ధర్నాలతో దద్దరిల్లిన ఢిల్లీ జంతర్ మంతర్

బిసి మహిళా సంఘం రాష్ట్ర ప్రదాన కార్యదర్శి నిర్మల ముదిరాజ్ హర్షం
హైదేరాద్ ఏప్రిల్ 5 (బీసీలకు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని పార్లమెంట్లో బిసి బిల్లు పెట్టాలని, బిసి ఉద్యోగులకు ప్రమోషన్ల లో రిజర్వేషన్స్ కల్పించాలని, మహిళా బిల్లు పెట్టాలని, జనగణనలో కులగలను చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద రెండు రోజులుగా మహా ధర్నానిర్వహించడం జరిగింది … జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో లాల్ కృష్ణ, గుజ్జ సత్యం ,నీలం వెంకటేష్ రాజేందర్ , అనంతయ్య , అంజి నిర్మల ముదిరాజ్ తో పాటు వందలాది మంది బీసీ నాయకులు చేసిన ధర్నా తో జంతర్ మంతర్ దద్దరిల్లి పోయింది. ధర్నాలో పాల్గొన్న నాయకులు అందరికీ బిసి సంఘం తరపున సంఘం రాష్ట్ర ప్రదాన కార్యదర్శి ఎన్, నిర్మల ముదిరాజ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు

Leave A Reply

Your email address will not be published.

Breaking