ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 05 : బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆస్థిరపరచడానికే బండి సంజయ్ కుట్రపూరితమైన చర్యలకు పాల్పడుతున్నాడని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు అన్నారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ…10వ తరగతి ప్రశ్నపత్రం లీకేజీ పై బిజెపి పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ తిరు పై మండిపడ్డారు.10వ తరగతి ప్రశ్నాపత్రం లీకేజీలో ఎంత పెద్ద నాయకుడు ఉన్నా వారిని ప్రభుత్వం శిక్షిస్తుందని,రాజకీయం కోసం లక్షలాదిమంది విద్యార్థుల జీవితాలతో ఆటలుఆడుకోవడం సమంజసంకాదన్నారు,పేద ప్రజల కోసం పని చేస్తున్న తెలంగాణ ప్రబుత్వం పై బురద జల్లే నిచ రాజకీయాలకు పాల్పడుతున్నారని అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో బిజెపి కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని త్వరలోనే బిజెపి పార్టీ కి తగిన బుద్ది చెబుతారని అన్నారు.విద్యార్థుల జీవితాలతో చలగాటం ఆడుతున్న ఎంపి బండి సంజయ్ ను పదవి నుండి తొలగింది పార్టీ నుండి సస్పెండ్ చేయాలనీ అయన డిమాండ్ చేశారు. అనంతరం బిఆర్ఎస్ పార్టీ అద్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబి చౌరస్తా వద్ద బండి సంజయ్ దిష్టి బొమ్మ ను దగ్దం చేసి నిరసన తెలిపారు.ఈ కార్యక్రమంలో మంచిర్యాల బిఆర్ ఎస్ యువ నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్,మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య,నస్పూర్ మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్,కౌన్సిలర్లు,ప్రజా ప్రతి నిధులు,ముఖ్యనాయకులు, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.