ప్రైవేటు రంగంలో ఎస్సి,ఎస్టి, బిసి లకు రిజర్వేషన్లు పెట్టాలి

కేంద్ర మంత్రి భూపేంద్ర సింగ్ యాదవ్ ను కలిసిన బీసీ సంఘం నేతలు
న్యూ డిల్లీ ఏప్రిల్ 5 ();పార్లమెంట్ ఆవరణలో కేంద్ర కార్మిక ఉపాది శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ను జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బోల్క వెంకట్ యాదవ్ నేతృత్వం లో భూపేంద్ర సింగ్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ప్రైవేటు రంగంలో ఎస్సి,ఎస్టి, బిసి లకు రిజర్వేషన్లు పెట్టాలని బీసీల హక్కుల పరిరక్షణ కోసం పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని దేశంలో 56% ఉన్న బీసీలకు ప్రత్యెక బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, జనగణనలో కులగలను చేయాలని కోరారు.
అలాగే పార్లమెంట్ లో ప్రైవేటు బిల్లు పెట్టాలని, అందుకు అందరు సహకరించాలని పార్లమెంట్ సబ్యులు డాక్టర్ కే.లక్ష్మణ్,గాయిత్రి రవి, గోరింట్ల మాధవ్,వినయ్ టెండూల్కర్, పిల్లి సుబాష్ చంద్ర బోస్,బీద మస్తాన్ రావు,అఖిలేష్ యాదవ్, డింపుల్ యాదవ్,బడుగు లింగయ్య యాదవ్, తదితర ఎంపి లను కలిసి విజ్ఞప్తి చేసారు. ఇట్టి కార్యక్రమంలో లాల్ కృష్ణ ,కర్రి వేణు మాధవ్, ఆకుల స్వామి పటేల్ వేముల రామకృష్ణ బోయిన పృద్వి యాదవ్ తిరుమల నాగరాజు రాజు వెంకటేశు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking