డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విశ్వ విజ్ఞాన మూర్తి గుద్దేటి రమేష్ బాబు

 

ఖమ్మం ప్రెస్ క్లబ్ లో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 14 (ప్రజాబలం) ఖమ్మం సామాజిక సమానత్వ స్ఫూర్తి ప్రదాత, విశ్వ విజ్ఞాన మూర్తి, రాజ్యాంగ రూపశిల్పి భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలు భావితరాలకు మార్గదర్శకమని ఖమ్మం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుద్దేటి రమేష్ బాబు అన్నారు.

ఖమ్మం ప్రెస్ క్లబ్ లో శుక్రవారం బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. తొలుత బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పలువురు జర్నలిస్టులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా గుద్దేటి రమేష్ బాబు మాట్లాడుతూ చరిత్ర ఉన్నంతకాలం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలు సజీవంగానే ఉంటాయని, అంబేద్కర్ స్వహస్తాలతో లిఖించబడిన భారత రాజ్యాంగం భావితరాలకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. దేశానికి ఒక దిక్సూచిలా ఉండి తరతరాలకు ఆదర్శమూర్తిగా నిలిచిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతిని జరుపుకోవడం ఒక అదృష్టమని అన్నారు. ఆయన ఆశయాలను మరింతగా కొనసాగించాలని కోరారు.

టీయూడబ్ల్యూజే( టీజేఎఫ్) జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి ఆకుతోట ఆదినారాయణ, చిర్రా రవి సూచన మేరకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ప్రెస్ క్లబ్ లో అట్టహాసంగా జరిగాయి.

ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) జిల్లా ఉపాధ్యక్షులు టీఎస్ చక్రవర్తి, ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కొరకొప్పుల రాంబాబు, కోశాధికారి బిక్కి గోపి, ఎలక్ట్రానిక్ మీడియా నగర అధ్యక్ష కార్యదర్శులు యలమందల జగదీష్, కరిశ అశోక్, ప్రెస్ సహాయ కార్యదర్శి జీవన్ రెడ్డి, ఉపాధ్యక్షులు ముత్యాల కోటేశ్వరరావు, నాయకులు రోసి రెడ్డి, అంతోటి శ్రీనివాస్ , పొన్నెబోయిన పానకాలరావు, పి సి డబ్ల్యూ నరేష్, మధు, ఇ సంపల్లి వెంకటేశ్వర్లు, రమేష్, వెంకటేశ్వర్లు, శివకృష్ణ, జి. కుమార్, విజయం శ్రీనివాసరావు, గిరి, రమేష్ , వేల్పుల నాగేశ్వరరావు, లక్ష్మణ్ , తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking