ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 14 (ప్రజాబలం) ఖమ్మం ఖమ్మం నగరంలో పల్లా కిరణ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా అన్ని కులల , మతల నిరుపేద మహిళలకు కుట్టు మిషన్లు , చీరలు మరియు నిరుపేద ముస్లింలకు రంజాన్ తోఫా లను పంపిణీ చేశారు . తన తండ్రి పల్లా జాన్ రాములు అడుగుజాడల్లో నడుస్తూ నలుగురికి సహాయం చేస్తూ నిరుపేదలకు అండగా ఉంటూ తన తండ్రి ఆశయ సాధనకే కృషి చేస్తున్నాడు అని తెలిపారు . తన పుట్టినరోజు వేడుకలను ఇంతమంది ప్రజల ముందు చేసుకోవడం చాలా ఆహ్లాదకరంగా ఉందని పేర్కొన్నారు . తన తండ్రి ఎప్పుడూ చెప్తుండేవారని జీవితంలో నలుగురికి ఉపయోగపడుతూ వారి మన్నెలను పొందినప్పుడే జీవితానికి సాదికారత లభిస్తుందని . అలాగే ఈ రంజాన్ పండుగను ముస్లిం సోదరులందరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు .