రాజన్న సిరిసిల్ల జిల్లా, 07, మార్చి2023 ప్రజాబలం ప్రతినిధి.
బాల సాహిత్యంలో సేవ కు గానూ గుర్తింపు
– అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా అందజేయనున్న ప్రభుత్వం
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పలు రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న మహిళలకు తెలంగాణ ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది. పలు రంగాలకు చెందిన మొత్తం 27 మందిని ఈ స్పెషల్ అవార్డులకు ఎంపిక చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి భారతి హోళీకేరి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఏడాది (2023) కు గానూ మొత్తం 27 మంది మహిళలను అవార్డుతో పాటు ప్రతి ఒక్కరికి 1 లక్ష రూపాయల చొప్పున నగదు పురస్కారాన్ని సర్కార్ అందజేయనుంది.
సిరిసిల్ల చెందిన ప్రముఖ రచయిత్రి డాక్టర్ కందేపి రాణి ప్రసాద్ కు రాష్ట్ర ప్రభుత్వ అవార్డ్ కు ఎంపికైంది.సాహిత్యంలో ఆమె చేసిన సేవ కు గానూ ఈ గుర్తింపు లభించింది.
ప్రముఖ రచయిత్రి డాక్టర్ కందేపి రాణి ప్రసాద్ సాహితీ రంగానికి చేసిన సేవలు ఇవే
బాల సాహితి వేత్తగా యాబై పుస్తకాల రచన. మహిళా శిశు అభ్యుదయం కొరకు ప్రమాదకర జబ్బుల గురించి అవగాహన కల్పించేందుకై రచనల్లో కథలు, కవితలు, వ్యాసాలు, పజిల్స్, సైన్స్ వ్యాసంగం, గల్పికలు మొదలైన ప్రక్రియల ద్వారా ప్రయత్నించారు.
రాణీ ప్రసాద్ ముద్రిత రచనలు
1. ‘పూలతోట’ (కవితా సంకలనం) బాల సాహిత్యం 1999, 2008
2. ‘సరదా సరదా బొమ్మలు’ 2001
3. ‘వార్త దినపత్రిక’ ‘మొగ్గ’ లో పిల్లల కోసం బొమ్మలతో అచ్చయిన వ్యాసాలు
4. ‘హరివిల్లు’ (కవిత సంకలనం) బాల సాహిత్యం 2004
5. ‘నెలవంక’ (కవిత సంకలనం) బాల సాహిత్యం 2003
6. ‘సైన్స్ పాయింట్’ ( 2004 )
7. ‘బాలతేజం’ మాసపత్రికలో ‘సైన్స్ పాయింట్’ శీర్షికన అచ్చయిన వ్యాసాలు
8. ‘నందివర్ధనాలు’ నానీలు ( 2006)
9. ‘బాల్యమా ఎక్కడ నీ చిరునామా!’ వ్యాసాలు (2008)
10. ‘విహారం’ యాత్రా కథనాలు (2009)
11. ‘కస్తూరిబా’ జీవిత చరిత్ర (2009)
12. ‘మిటాయిపొట్లం ‘ (2013)
13. ‘సైన్స్ వరల్డ్’ సైన్స్ వ్యాసాలు (2015)
14. సీతాకోకచిలుక’ సైన్స్ గేయాలు (2016)
15. ‘హౌస్ వైఫ్’ (కవిత్వం) (2018)
16. ‘సైన్స్ కార్నర్’ (సైన్స్ వ్యాసాలు) (2018)
17. ‘పూలజడ’ (బాల్య జ్ఞాపకాలు) (2018)
18. ‘స్వీటీ మిల్కీ ఓ చిలుక’ (బాలల కథలు) (2018)
19. ‘ద్రాక్ష గుత్తులు’ (బాలగేయాలు) (2018)
20. ‘కనుచూపు మేర’ (యాత్రా కథనాలు) (2018)
21. ‘సౌరభం’ (బాలసాహిత్య వ్యాసాలు) (2019)
22. ‘పజిల్స్ ప్లాంట్’ (పిల్లల పజిల్స్) (2019)
23. ‘బొటనికల్ జూ’ (వెజిటబుల్ కార్వింగ్ వ్యాసాలు) (2019)
24. ‘సృజన’ (పిల్లల ప్రేల పుస్తకం) (2020)
25. క్వారంటైన్ (2021)
26. డాక్టర్ చెప్పిన కథలు (2022)
27. నా జ్ఞాపకాల్లో అమ్మ (2022)
ప్రముఖ రచయిత్రి డాక్టర్ కందేపి రాణి ప్రసాద్ అనువాదాలు
1) చక్రాల కథ
2) మంగు బొంగరం
3) నాకొక జిరాఫీ కావాలి
4) నాకు శలవులోచ్చాయి
5) మనసు పక్షి
6) బొమ్మ షికారు
7) పర్వతాల పై ప్రయాణం
8) అపరంజి బొమ్మ
9) రాహుల్ మరియు కళల బ్యాటు
రచయిత్రి డాక్టర్ కందేపి రాణి ప్రసాద్ వ్యాసాలు :
• ప్రపంచంలోని వివిధ శునక జతులపై ప్రాసిన వ్యాసాలు – 35
• వార్త దినపత్రిక మొగ్గలో ఆగస్టు 2001 నుండి మే 2002 వరకు ప్రచురించబడ్డాయి.
• పిల్లల విద్య, పాఠశాల సమస్యలపై వ్రాసిన వ్యాసాలు వివిధ దినపత్రికల్లో ప్రచురించబడ్డాయి.
• సైన్స్ వ్యాసాలు 50 ప్రచురించబడ్డాయి.
• సాహిత్య వ్యాసాలు 10 ప్రచురించబడ్డాయి.
• యాత్రా చరిత్రలు 40 వ్యాసాలు ప్రచురణ.