జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య
విశాఖపట్నం మార్చ్ 7 చట్టసభలో బీసీ బిల్లుపై ఏప్రిల్ 3న పార్లమెంటు ముట్టడించనున్నట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య వెల్లడించారు.మంగళవారం ముఖ్యఅతిథిగా విశాఖ జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు డబ్బిరు కుమార్ స్వామి ఆధ్వర్యంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం వివిధ విభాగాల ముఖ్య నాయకుల సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి ఢిల్లీ ఇన్చార్జ్ కర్రి వేణుమాధవ్ అధ్యక్షతన సమావేశం జరిగింది వైయస్సార్సీపి పట్టబద్దుల ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న సీతంరాజు సుధాకర్ గారి విజయాన్ని కాంక్షిస్తూ టిటిడి చైర్మన్ ఉత్తరాంధ్ర వైఎస్ఆర్సిపి ఇన్చార్జి వై వి సుబ్బారెడ్డి గారి తో పాటుగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆర్ కృష్ణయ్య అనంతరం జాతీయ బీసీ సంక్షేమ సంఘ కార్యాలయంలో జరిగిన జాతీయ బీసీ సంక్షేమ సంఘంఅనుబంధ విభాగాల సమావేశంలో మాట్లాడుతూ ఉత్పత్తి కులాల అయినటువంటి బీసీ కులాలకు 75 ఏళ్ల స్వతంత్రం అనంతరం కూడా అన్యాయమే జరుగుతుందని అన్ని రంగాల్లో కూడా బీసీలకు సరైన ప్రాతినిధ్యం దక్కలేదు అని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ కోసం ప్రైవేట్ బిల్లు పెట్టించడం చారిత్రాత్మక విషయమని బీసీలు ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి పార్టీలు కూడా బీసీ బిల్లు కోసం ఇంత కమిట్మెంట్ గా పని చేయలేదని దీన్ని స్వాగతించి ప్రతి బీసీ మన అభివృద్ధి కోసం మన రాజ్యాధికారంలో వాటా కోసం మనల్ని కుటుంబ సభ్యులుగా చూసుకుంటూ మన అభివృద్ధి రాజ్యాధికారం మన వాటా కంటే ఎక్కువగా తన విధానంలో అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్సిపి ఎమ్మెల్సీ అభ్యర్థుల విజయంతో పాటుగా మెజార్టీలో ఎక్కువగా ఓటింగ్ చూపించి బీసీలు ఎంత చేస్తే అంత అండగా ఉంటామని సందేశాన్ని ఇవ్వవలసిందిగా బీసీ పట్టబద్ధులకు ఆర్ కృష్ణయ్య గారు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా పలు విషయాలపై ఆసక్తికరంగా మాట్లాడిన ఆర్ కృష్ణయ్య గారు రాజ్యాధికారంలో మా వాటా మాకు దక్కడానికి ఒక పెద్ద రాజకీయ పార్టీ వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు అండగా నిలవడం చారిత్రాత్మక విషయమని దేశంలో పన్నులు ఎక్కువ మొత్తంలో చెల్లిస్తుంది బీసీలనీ అని దేశంలో ఎక్కువ శాతం ఓటింగ్లో పాల్గొనే రాజ్యాధికారం అన్ని పార్టీలకు ప్రసాదిస్తుంది బీసీలనీ దేశంలో ఆదాయాన్ని ఎక్కువగా ఉత్పత్తి కులాలు ఉండి ఉత్పత్తి సాధిస్తుంది బీసీలనీ కానీ రాజ్యాధికారంలో బీసీలకు నాడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు ఆర్టికల్ 340 ప్రకారం ఏ కుల జనాభా ఎంత మంది ఉంటే వారి ప్రతినిధులు చట్టసభలో ఉండాలని రాజ్యాంగంలో పొందుపరిస్తే 121 సార్లు సవరించిన భారత దేశ రాజ్యాంగాన్ని 56% ఉన్నటువంటి బీసీల కోసం ఎందుకు ఆర్టికల్ 340 అమలు చేయడం లేదని ఇది బీసీలను అన్ని రంగాల్లో అన్యాయం చేయడమే అని ఆర్ కృష్ణయ్య మండిపడ్డారు దీనికై ఏప్రిల్ 2 3 తారీకుల్లో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించి పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టే వరకు పోరాటం కొనసాగిస్తామని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో నీలం వెంకటేష్ ఎన్ మారేష్ పితాని ప్రసాదు వారణాసి అన్నాజీ రావు ధర్మరాజు 29వ కార్పొరేటర్ వి నారాయణరావు యాదవ్ మరియు పలు అనుబంధ విభాగాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు
Prev Post