రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 13 సెప్టెంబర్ 2023: శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గమ్ లోని గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ శైక్పెట్ డివిజన్ పరిధిలోని ఓ.యూ.కాలనీ నుండి డ్రెయినేజీ లైన్ ను మణికొండ మునిసిపాలిటీ డ్రీమ్ వాలీ ద్వార శ్రీ తిరుమల రెసిడెన్సీ వెనుక భాగంగా అంబీయాన్స్ కోర్టులో నుండీ కలపడానికి ప్రయత్నాలు చేస్తున్నారనీ తెలుసుకొని కట్టడి చేయడానికి గతంలో మున్సిపల్ అధికారులకు, ప్రజా ప్రతినిధులకు, స్థానిక నాయకులకు విన్న వించుకోవడం జరిగినను లాభం లేనందున, చిత్రంగా వారందరి చలువతో, అనుకులతతో డ్రెయినేజీ పనులు నిరాటంకంగా జరుగుతున్నందున పర్యవసానం లేనందున హుడా కలనీ, తనషా నగర్, ఎంప్లాయీస్ కాలనీ, భాగ్యలక్ష్మి కాలనీ నివాసితులు ధర్నా నిర్వహించడం జరిగినది అందుకు పూర్తీ సహకారం అందించిన వారిలో ఆల్ కాలనీ ఫెడరేషన్ కార్యదర్శి ఆంజనేయులు, మనికొండ కౌన్సెల్ ఉపాధ్యక్షుడు కే. నరేందర్ రెడ్డి, బీ.ఆర్.ఎస్. ఫ్లొర్ లీడర్ కే. రామకృష్ణ రెడ్డి, స్థానిక 4 వ వార్డ్ కౌన్సిలర్ వందన నగేశ్, పెంటా రెడ్డి, సత్యనారాయణ, రాజలింగం, రాంచందర్, తీప్పరాజు రమేశ్ బాబు తది తరులు కార్యక్రమంలో పాల్గొని మద్దతు ప్రకటించినారు.