ఓయూ లో కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ ల నిరసన

 

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాప్రతినిధి (ప్రజాబలం):12 యూనివర్సిటీలలో పని చేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను క్రమబద్దీకరించాలని డిమాండ్ చేస్తూ ఓయూ లో కాంట్రాక్టు అధ్యాపకులు పెన్ డౌన్ అండ్ చాక్ డౌన్ కార్యక్రమం పేరుతో తరగతులు బహిష్కరించి ఓయూ లోని ఆర్ట్స్ కళాశాల బస్ స్టాప్ వద్ద నిరసన చేపట్టారు. తక్షణమే కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ లను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ధర్మ తేజ మాట్లాడుతూ మాట్లాడుతూ గత 14 రోజుల నుండి కాంట్రాక్ట్ అధ్యాపకులు వారి విధులకు హాజరు కాకుండా నిరసన కార్యక్రమాలు చేస్తుంటే అటు ప్రభుత్వం ఇటు విశ్వవిద్యాలయాల అధికారులు చోద్యం చూస్తూ కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. గత నాలుగు నెలలుగా వివిధ రూపాలలో నిరసన కార్యక్రమాలు చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. ఉస్మానియా పరిధిలోని అన్ని కళాశాలలో విద్యార్థులు తరగతులు జరగకపోవడం వలన ఇబ్బంది పడుతున్నారని అయినా సంబంధిత అధికారుల నుండి స్పందన లేకపోవడం బాధాకరం అని తెలిపారు. పాఠాలు చెప్పాల్సిన అధ్యాపకులు రోడ్లపై కూర్చొని ధర్నాలు చేస్తుంటే ప్రభుత్వం స్పందించకపోవడం దారుణం అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అధ్యాపకులను క్రమబద్ధీకరించాలని లేకపోతే నిరసన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయని హెచ్చరించారు. కార్యక్రమంలో డా. రేష్మ రెడ్డి, డా.రామేశ్వర్, డా. విజయేందర్ రెడ్డి, డా.స్రవంతి రెడ్డి, సి హెచ్జ్,వెంకటేశ్వర్లు, డా. ఉపేందర్ రావు, డా. సత్యం, డా. కిరణ్, డా. కృష్ణయ్య,డా. రమేష్, డా. కిరణ్, డా. మల్లేష్, డా. మాధవి, డా. వెంకటేశ్వర్లు , డా. నరేష్, డా. అశోక్ బస్వ, డా. స్రవంతి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking