చంద్రబాబు అరెస్టుకు నిరసనగా మౌనదీక్ష

 

గాంధీ విగ్రహం ఎదుట టీడీపీ నిరసన

జగిత్యాల, సెప్టెంబర్ 13: ఆంద్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా జగిత్యాల టిడిపి నాయకులు గాంధీ విగ్రహం ఎదుట మౌనదీక్ష చేపట్టారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని మంచినీళ్ల బావి వద్దగల గాంధీ విగ్రహం ఎదుట జగిత్యాల టిడిపి నియోజకవర్గ ఇంచార్జ్ మహంకాళి రాజన్న ఆధ్వర్యంలో టిడిపి నాయకులు ధీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహంకాళి రాజన్న మాట్లాడుతూ ఏపీ లో ప్రజాస్వామ్యం ఖుని అయ్యిందన్నారు. జగన్ రెడ్డి పాలనలో ఎఫైఆర్స్ ఉండవని అన్ని కుట్ర కేసులేనన్నారు. చంద్రబాబు అరెస్ట్ రోజునే 37 వ ముద్దాయిగా చేర్చడం ఎంతవరకు సమంజసం అని రాజన్న ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి చర్య తప్పు అని ఇరురాష్ట్రాల ప్రధాన పార్టీల నాయకులు విమర్శించినా పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఓరుగంటి భార్గవ్ రామ్, కొండ శ్రీదర్ అక్కినపెళ్ళి కాశినాతం, బత్తుల కొండయ్య, భూమారెడ్డి, సోమా నారాయణ రెడ్డి, నక్క లక్ష్మణ్, కోయ బాలకృష్ణ, రంగు శ్రీనివాస్, ఆవుల రాయుడు, మగ్గిడి గంగాధర్, వుప్పుల రవి, కందుకూరు తిరుపతి, జలెందర్ రెడ్డి, నర్సయ్య, రాజయ్య యాదవ్, రాజేష్, యం. డి భాబా లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking