మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రతినిధి 13సెప్టెంబర్ (ప్రజాబలం):రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జేఎల్ పరీక్షలో మొదటి పేపర్ ఇంగ్లీషులో పేపర్ లో సిలబస్ లో లేని ప్రశ్నలే 70శాతం రావడం బాధాకరమని నిరుద్యోగ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఓయూ జేఏసీ అధ్యక్షుడు డాక్టర్ ఏల్చల దత్తాత్రేయ మాట్లాడుతూ ప్రశ్నా పత్రానికి వ్యాలిడిటీ లేదని మండిపడ్డారు. తక్షణమే టిఎస్పిఎస్సి అధికారులు ప్రశ్నపత్రాన్ని సమీక్షించి అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే ప్రశ్నపత్రాన్ని సమీక్షించి సిలబస్ లో లేని ప్రశ్నలు తొలగించాలన్నారు. సీనియర్ ప్రొఫెసర్ తో కమిటీ వేసి ప్రశ్నాపత్రం వ్యాలీడిటీ ని తేల్చాలని విజ్ఞప్తి చేశారు. కట్ ఆఫ్ మార్కులను తగ్గించి అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జెఎల్ అభ్యర్థులు ప్రణీత్, అంజి యాదవ్, రాజేష్, నరేందర్, షబ్బీర్, నరేష్, చిరంజీవి, నాగరాజు, వంశీ తదితరులు పాల్గొన్నారు.