డ్రైవర్లు జాగ్రత్తలు పాటిస్తూ వాహనాలు నడపాలి చేగుంట ఎస్సై ప్రకాష్ గౌడ్.

 

మెదక్ చెగుంట ప్రజా బలం న్యూస్ :-

దూర ప్రయాణం చేసే డ్రైవర్లు జాగ్రత్తగా డ్రైవ్ చేస్తూ మధ్యలో సేద తీర్చుకోవాలని చేగుంట ఎస్సై ప్రకాష్ గౌడ్ అన్నారు. రోడ్డు రవాణా భద్రతలు భాగంగా మెదక్ జిల్లా మండల కేంద్రమైన మాసయిపేటలోనీ 44వ జాతీయ రహదారిని ఆనుకొన ఉన్న పంజాబీ దాబా వద్ద డ్రైవర్లకు అవగాహన సదస్సును చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సై ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ దూర ప్రయాణం నిరంతరంగా ఐదు ఆరు రోజులపాటు ఏకధాటిగా ప్రయాణం చేసే డ్రైవర్లు మధ్యలో ఒక గంట పాటు సేదతీర్చుకుంటే బాగుంటుందని ఎస్సై డ్రైవర్లకు సూచించారు. డ్రైవింగ్ చేసేటప్పుడు మద్యం మత్తు పానీయాలకు దూరంగా ఉండాలన్నారు. డ్రైవరు విధి నిర్వహణలో ఏం అజాగ్రత్త వహించిన నిండు ప్రాణాలు బల్లి తీసుకున్న వారు అవుతారని ఎస్సై వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎ ఏస్ఐ రవీందర్,తో పాటు పోలీస్ సిబ్బంది, లారీ డ్రైవర్ లు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking