న్యాయం కోసం ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా? ఎందుకు పోలీసుల అత్యుత్సాహం : తూర్పు ఎమ్మెల్యే కంటెస్టెడ్ కుసుమ సతీష్ బాబు
వరంగల్ ప్రజాబలం ప్రతినిధి ఫిబ్రవరి 27:
కాకతీయ వైద్య కళాశాల విద్యార్థిని ప్రీతి మరణం వైద్య రంగానికి తలవంపులు అని వరంగల్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే కుసుమ సతీష్ బాబు అన్నారు. ప్రీతి ఆత్మకు శాంతి చేకూర్చాలని బాధితున్ని బహిరంగంగా ఉరి తీయాలని వరంగల్ ఎంజీఎం సెంటర్లో దిష్టిబొమ్మను దహనం చేస్తుంటే పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తప్పు చేసిన వారిని కాపాడే ప్రయత్నంలో ప్రభుత్వం పోలీసులను పావులుగా వాడుకుంటున్నారని ఈ విషయం పోలీసులు గుర్తించు కోవాలని అన్నారు. నిరసన తెలుపుతున్న బీజేపీ ఏస్సే ఎస్టీ మోర్చా నాయకుల ను ఉగ్రవాదుల మాదిరిగా అరెస్టు చేసి జిల్లా దాటించడం హేయమైన చర్య అన్నారు. ప్రీతిని నిందితుడు సైఫ్ కావాలనే వేధింపులకు పాల్పడ్డాడని పోలీసుల విచారణలో తేలడంతో ఇంకా ఎందుకు కాలయాపన జరుగుతుందో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ నాయకులు విద్యార్థులు యువకులు ఆలోచించాలని అన్నారు. సైఫ్ కు అమ్మాయి తనను వేధించ వద్దని మెస్సేజ్ పెట్టడం అప్పటికీ అమ్మాయిని వృత్తిలో భాగంగా వేధించడం పోలీసులే నిర్ధారణ చేశారని ఆరోపించారు. పోలీసులకు పిర్యాదు చేసినా నిర్లక్ష్యం కారణంగా ప్రీతి ఆత్మహత్య చేసుకుందని నిందితున్ని ఉరి తీసే విషయంలో కాలయాపన చేయకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అమ్మాయి తండ్రి రైల్వే పోలీస్ అధికారి ప్రతి పోలీస్ అధికారి తండ్రి హోదాలో ఆలోచించాలని లేకుంటే అమ్మాయిలు ఉన్నత చదువులు చదువు కోవలంటే భయపడే పరిస్థితులు ఉంటాయని హెచ్చరించారు. ఒక వైద్య విద్యార్థిని పరిస్థితి ఇలా ఉంటే ఇక పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలు, కాలనీలోని ఆడపిల్లల పరిస్తితి ఏంటని ప్రశ్నించారు. ఈ మధ్యకాలంలో నగరంలో జరుగుతున్న ఆడపిల్లపై హత్యాచారాలు, వేధింపులు ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు వైఫల్యాలే అని అన్నారు. ఈ కార్యక్రమంలో బాకం హరిశంకర్, బన్న ప్రభాకర్, ఎరుకల రఘునాథ్ రెడ్డి, ఆడెపు వెంకటేశ్వర్లు, బైరి శ్యామ్, గోక వెంకటేశ్వర్లు, మార్టిన్ లూథర్, కొత్తపల్లి రాజేష్, మల్లాడి తిరుపతి రెడ్డి, పిట్టల కిరణ్, కనుకుంట్ల రంజిత్, లాలూ నాయక్, సాముద్రాల పరమేశ్వర్, ఒంటెల ప్రసాద్, బండి సుజాత, బండారి కల్యాణి, సింగారపు సుజాత, సూత్రపు సరిత తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.