పాత నేరస్తులకు కౌన్సిలింగ్ ఇచ్చిన డి.ఎస్.పి.

 

మెదక్ తూప్రాన్ ప్రాజబలం న్యూస్:-

నేర చరిత్ర కలిగిన
రౌడీషీటర్ లు ఇక మీద సత్ప్రవర్తన కలిగి ఉండాలని తూప్రాన్ డిఎస్పీ వెంకట్ రెడ్డి కౌన్సిలింగ్ ఇచ్చారు. తూప్రాన్ సర్కిల్ పరిధి లోని తూప్రాన్, శివ్వంపేట్, వెల్దుర్తి, మనోహరబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోనీ సుమారు 50 మంది రౌడీ షీటర్ లను మంగళవారం డిఎస్పీ వెంకట్ రెడ్డి ముందు హజరుపర్చగా విడి విడిగా ఒక్కొక్కరి పై ఉన్న పాత కేసుల పూర్వాపరాలు విచారించిన పిదప ఇక పై సత్ప్రవర్తన కలిగి ఉండి నేర చరిత్ర లేకుండా జాగ్రత్త పడాలి అని సూచించారు. జీవితంలో మార్పు రావాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ సి.ఐ కృష్ణ, ఎస్.ఐ శివానందం, శివ్వంపేట్ ఎస్.ఐ మహిపాల్ రెడ్డి, వెల్దుర్తి ఎస్.ఐ నవతగౌడ్, మనోహరబాద్ ఎస్.ఐ కరుణాకర్ రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking