ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. ఆర్టీసీ నిర్మల్ డిపో లో విలేజ్ బస్ ఆఫీసర్ వినూత్న కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిర్మల్ డి.ఎస్.పి.శ్రీ.ఎల్.జీవన్ రెడ్డి హాజరయ్యారు.
గ్రామ గ్రామన వీలేజ్ పోలీస్ ఆఫీసర్ లాగా విలేజ్ బస్ ఆపీసర్ ను నియమించడం హర్షించదగ్గ విషయమని ఆయన కొనియాడారు.
గ్రామ సభల్లో పాల్గొని గ్రామస్థుల సూచనలు,సలహాలు తీసుకొని వారికి అనుకూలంగా సమస్యలు రాకుండా వారికి సేవలు చేయాలని ఆయన పేర్కొన్నారు.ఆదిలాబాద్ రీజియన్ లోనే
మే నెలలో నిర్మల్ డిపో కోటి ఏడూ లక్షల లాభాలు రావడం ఎంతో సంతోషించ దగ్గ విషయమని అలాగే తెలంగాణ రాష్ట్రం లోని నంబర్ వన్ డిపో గా నిలవాలని ఆయన ఆకాంక్షించారు.
డిపో మేనేజర్ సాయన్న. మాట్లాడుతూ నిర్మల్ డిపో పరిధిలో ప్రస్తుతం 10 మంది విలేజ్ బస్ ఆఫీసర్లను నియమించమని అతి త్వరలో ప్రతి గ్రామానికి ఆర్టీసీ విలేజ్ బస్ ఆఫీసర్ ను నియమిస్తామని ఆయన పేర్కొన్నారు.
వీరు నెలలో రెండు సార్లు వారి గ్రామాన్ని సందర్శించి ఆర్టీసీ ప్రవేశ పెడుతున్న పథకాలను ప్రజలకు ( ప్రయాణికులకు ) వివారిస్తారని,పెళ్లిళ్లకు శుభకార్యాల కు బస్సు లు ఇవ్వడం వీరే చుసుకుంటారని,ప్రయాణికుల రద్దీని బట్టి బస్సులను నడపడం నెలవారీ రూట్ పాసులు,సీజన్ టికెట్లు,విద్యార్థుల బస్ పాసులు ఇప్పించడములో వీరు సహాయ పడతారని.విద్యార్థులకు ఆన్ లైన్ ద్వారా ఏమయినా సమస్యలుంటే వీరిని సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు.వీరి పేరు ఫోన్ నంబర్ ప్రతి గ్రామం లోని గ్రామ సచివాలములో నోటీసు బోర్డు పై వ్రాయిస్తామని వారిని సంప్రదించి ప్రజలు సూచనలు సలహాలు విజ్ఞప్తులు తెలపాలని ఆయన.పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సహాయ మేనేజర్లు ఐ. రాజశేఖర్,శ్రీకర్
విలేజ్ బస్ ఆఫీసర్లు ఉద్యోగులు పాల్గొన్నారు.